Salaar Trailer : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సలార్ ట్రైలర్ వచ్చేసింది. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంటూ.. దోస్త్ కోసం ప్రభాస్ ఈసారి యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రశాంత్ నీల్ సలార్ ట్రైలర్ విడుదల చేసి ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నాడు. డిసెంబర్ 22న బాక్సాఫీస్ లో రికార్డుల మోత మోగడం ఖాయమని ట్రైలర్ తో తెలిసిపోతుంది.
కేజీఎఫ్ మూవీ తో సెన్సేషనల్ హిట్ సాధించిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. భారీ పాన్ ఇండియన్ మూవీ కావడంతో అందరిచూపు సలార్ పైనే పడింది. అందులోనూ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కావడం తో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ నీల్ సలార్ ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగానికి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది.
ముందుగా ఊహించినట్లుగానే ప్రశాంత్ నీల్ ట్రైలర్ ని ఓ రేంజ్ లో దించాడు. సినిమా పై రెట్టింపు అంచనాలను క్రియేట్ చేశాడు.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ తెరకెక్కనుంది. కేజీఎఫ్ సినిమాను ను మించి ఈ ట్రైలర్ ఉంది. యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. 3 నిమిషాల 47 సెకండ్స్ గల ఈ ట్రైలర్ దెబ్బకు సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాతో డార్లింగ్ ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. 5 భాషల్లోని ప్రేక్షకుల కోసం సలార్ ట్రైలర్ ను విడుదల చేశారు. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న సినిమా రిలీజ్ అవుతుంటే అమెరికా వాసులకు మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చారు. డిసెంబర్ 21 నే మూవీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ ట్రైలర్ లో శృతిహాసన్ సీన్స్ పెద్దగా కనిపించినప్పటికీ మిగతా స్టార్స్ మాత్రం తమ యాక్షన్ తో ఇరగదీసారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.