Salaar Trailer : ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ లో భీభత్సం సృష్ఠించాడు. ఈ దెబ్బతో అన్నీ సౌత్ ఇండస్ట్రీలలో రికార్డ్స్ మొత్తం బ్రేక్ అవడం ఖాయం అంటున్నారు. ‘కేజీఎస్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్ కేస్ ఫైర్ 1’ ట్రైలర్ తాజాగా రిలీజై యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ ని ఎంత ఎలివేషన్ తో చూడాలో అంతకి రెండింతలు ఎలివేషన్ తో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడని తాజా ట్రైలర్ చెబుతోంది.
గత కొంతకాలంగా ప్రభాస్ కి హిట్ దక్కడం లేదు. ‘రాధే శ్యామ్’, ‘సాహో’ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాంతో అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు ప్రేక్షకులు, అభిమానుల నుంచి ఒత్తిడి తో పాటు అంచనాలు అసాధారణంగా ఉన్నాయి. వాటిని తట్టుకుంటూ ప్రభాస్ ‘సలార్’ సీక్వెల్స్ చేస్తున్నాడు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ‘సలార్’ రిలీజ్ కాబోతుంది.
Salaar Trailer : ట్రైలర్ సృష్ఠిస్తున్న భీభత్సం మాటల్లో చెప్పలేము.
ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఒక్కొక్కరికీ మెంటలెక్కుతుంది. ‘సలార్’ ట్రైలర్ సృష్ఠిస్తున్న భీభత్సం మాటల్లో చెప్పలేము. ట్రైలర్ ప్రారంభంలోనే ఇది ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ అని హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. కొన్ని కారణాల వల్ల బద్ధ శత్రువులుగా మారి క్లిష్టమైన పరిస్థితుల్లో మళ్ళీ తన స్నేహితుడిని కాపాడటం కోసం తిరిగి వస్తాడని అర్థమవుతుంది.
ఇక ట్రైలర్ “నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా..నీ ఒక్కడికోసం”..అంటూ చిన్నప్పటి ప్రభాస్ చెప్పే డైలాగ్ తో మొదలైంది. దేవ గా ప్రభాస్ కనిపించబోతున్నాడని ఫస్ట్ షాట్ లోనే క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. “పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి..బయటికి ఎవడో పోతాడని కాదు..లోపలికి ఎవడొస్తాడని”..”ప్లీజ్.. ఐ కైండ్లీ రిక్వెస్ట్”.. అంటూ ‘సలార్ పార్ట్ 1 కేస్ ఫైర్” లో ప్రభాస్ సృష్ఠిస్తున్న భీభత్సం అంచనాలకి అందడం లేదు. కాగా, ఈ మూవీలో శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హోంబలే నిర్మాణ సంస్థపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంగీతం రవి బ్రసూర్
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.