Salaar: ‘సలార్’ షూటింగ్ కి పట్టిన రోజులు 114 అని ఇప్పుడు ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ప్రభాస్, శృతి హాసన్, పృథ్విరాజ్, జగపతిబాబు లాంటి స్టార్ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘కేజీఎఫ్’ కంటే భారీ ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజై యూట్యూబ్ ని వణికించింది.
ప్రభాస్ నుంచి ఎలాంటి యాక్షన్ సినిమా కోరుకుంటున్నారో అలాంటి సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో వస్తుందని ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలవుతాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే, ట్రైలర్ చూసిన తర్వాత మేకింగ్ కోసం ప్రశాంత్ నీల్ తీసుకుంది కేవలం 114 రోజులే అని, ఈ విషయంలో రాజమౌళి కంటే ఆయనే బెస్ట్ అని చెప్పుకుంటున్నారు.
Salaar: ప్రశాంత్ నీల్ రాజమౌళికి పోటీ అవుతాడని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే, కేజీఎఫ్ సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ రాజమౌళికి పోటీ అవుతాడని చెప్పుకుంటున్నారు. కేవలం మేకింగ్ పరంగా మాత్రమే కాదు అన్నీ విషయాలలో రాజమౌళిని అతి త్వరలో దాటే దర్శకుడు ప్రశాంత్ నీల్ అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ తీసింది లేదు. సినిమా సినిమాకి ఎదుగుతూ వచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్కార్ కూడా అందుకున్నారు. అంత గొప్ప దర్శకుడిని ప్రశాంత్ నీల్ ఇంత ఈజీగా దాటగలడా..? అని మరో మాట వినిపిస్తుంది. కానీ, అవకాశాలైతే లేకపోలేదు. అదే గనక జరిగితే రాజమౌళి తలదన్నే దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ని చెప్పుకోవడం ఖాయం. కాబట్టే , ప్రభాస్..ఎన్.టి.ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ లాంటి వారు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.