Salaar : దేవా ఒక సింహం..ప్రభాస్ క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చిన డైరెక్టర్

Salaar : ప్రస్తుతం దేశం మొత్తం సలార్ మేనియా కొనసాగుతోంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆన్లైన్లో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. టికెట్స్ రిలీజ్ చేసింది ఈరోజే అయినప్పటికి హాల్స్ మొత్తం ఫుల్ హౌస్ అయిపోతున్నాయి. సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ఇక ఆఫ్ లైన్ టికెట్స్ సంగతి దేవుడెరుగు. భారీగా క్యూ లైన్ లలో గంటలతరబడి టికెట్స్ కోసం నిలబడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశావ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోంది. ఫారెన్ లోనూ రికార్డ్ స్థాయిలో సలార్ మూవీ టికెట్స్ అమ్ముడయ్యాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

salaar-prashanth-neel-revealed-about-prabhas-charecter

సలార్ రిలీజ్ కు ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. వరుసగా ఫ్లాప్ లను చూస్తున్న ప్రభాస్ సలార్ తో నయా రికార్డ్ క్రియేట్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికీ రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా ప్రభాస్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అర్థమవుతుంది. సలర్ లో దేవా క్యారెక్టర్ పోషిస్తున్నాడు ప్రభాస్. తన ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగల ఓ సైనికుడిలా దేవా క్యారెక్టర్ డిజైన్ చేశాడు డైరెక్టర్. ఇది ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి చెప్పవచ్చు. కానీ డైరెక్టర్ అసలు ప్రభాస్ పాత్ర ను వెండితెర మీద ఎలా చూపించబోతున్నాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్, ప్రభాస్ గురించి అదిరిపోయే అప్డేట్ అందించాడు. సోలార్ మూవీ ఇద్దరి స్నేహితుల కథ అని ట్రైలర్ ద్వారా చెప్పేసాడు. ఇద్దరు ప్రాణ మిత్రులు, బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో తెర మీద చూస్తారని ప్రేక్షకులకు ట్విస్ట్ ఇచ్చాడు.

salaar-prashanth-neel-revealed-about-prabhas-charecter

ప్రభాస్ క్యారెక్టర్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ…” దేవా ది చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. అయినా దేవా మొఖంలో ఓ అమాయకత్వం కనిపిస్తుంది. అంతేకాదు ఓ పసి తనం చూడవచ్చు. ఈ రెండింటితో పాటే మరో కోణం కూడా కనిపిస్తుంది . దేవాకు ఆగ్రహం వస్తే ఆయనలో ఓ సింహం కనిపిస్తుంది. అవసరం అయితే ఎదుటివారి కాళ్లు పట్టుకుంటాడు..తేడా ఉంటే ఎవరిని లెక్కచేయకుండా తలను సైతం నరుకుతాడు”. అని ప్రభాస్ క్యారెక్టర్ గురించి ప్రశాంత్ నీల్ తెలిపాడు.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

23 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.