Salaar 2 : వరుస ఫ్లాపులు.. భారీ బడ్జెట్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. సలార్ అయినా సాలిడ్ హిట్ ఇస్తుందా? అని చాలామంది ప్రభాస్‌ను అనుమానించారు. కానీ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ సలార్‌తో దుమ్ముదులుపుతున్నాడు డార్లింగ్. బాక్సాఫీస్ దగ్గర సలార్ సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టించడం ఖాయంగా తెలుస్తోంది. విడుదలైన రోజే బ్లాక్ బస్టర్ హిట్ తో సలార్ దూసుకుపోతోంది. ప్రభాస్ లుక్ చూసి భారీ వసూళ్లను రాబడుతుందని ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రియేటివిటీ..ప్రభాస్ మాస్ లుక్, పృథ్వారాజ్ అమేజింగ్ నటన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. సలార్ ముందు కేజీఎఫ్ కూడా పనికిరాదని ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సలార్ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండటంతో ఫ్యాన్స్ ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు. ఇక తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. రిలీజ్ కి ముందే సలార్ రెండు పార్టులుగా వస్తుందని డైరెక్టర్ అనౌన్స్ చేశాడు. అందుకు తగ్గట్లుగానే సలార్ ఎండింగ్ లో సెకెండ్ పార్ట్ పై హింట్ వదిలాడు. కేజీఎఫ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ పార్ట్ ని సీజ్ ఫైర్ అనే టైటిల్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు మొదటి భాగం హిట్ టాక్ తో దూసుకెళ్తుండంతో అందరి ఆసక్తి సెకెండ్ పార్ట్ పై పడింది. ఈ క్రమంలో సెకండ్ పార్ట్ టైటిల్ ని కూడా ప్రశాంత్ నీల్ మొదటి భాగంలోనే రివీల్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో పూనకాలు వచ్చేశాయి.
సలార్ సెకెండ్ పార్ట్ కి ‘శౌర్యంక పర్వం’ అనే టైటిల్ అనౌన్స్ చేశాడు. సలార్ మూవీ మొదటి భాగం ఎండింగ్ లో థియేటర్స్ లో టైటిల్ ని రివీల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. డార్లింగ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫస్ట్ పార్ట్ హిట్ చూశాక ఇక సెకండ్ పార్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని భారీ ఆశలు పెట్టుకున్నారు. సలార్ ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ హైలెట్. తన లుక్స్, కూల్ ఆటిట్యూడ్, పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ భయ్యా అనాల్సిందే. బాహుబలి తర్వాత అంతటి కటౌట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా ఇమేజ్ తో వచ్చిన సలార్ థియేటర్స్ దద్దరిల్లిపోతోంది. యంగ్ రెబల్ స్టార్ కటౌట్ ఫ్యాన్స్ లో గూస్ బమ్స్ తెప్పిస్తున్నాయి. ప్రతి సీన్స్ లో ప్రభాస్ చింపేశాడంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతహా అంటున్నారు. సలార్ లోని కొన్ని ఫైటింగ్ సీన్స్ చూసి అభిమానులు థ్రిల్ ఫీల్ అయ్యారట.
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సలార్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఫస్ట్ షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. ట్విట్టర్ రివ్యూలు కూడా సినిమా సూపర్ అంటూ వచ్చేశాయి. విమర్శకులు సైతం సినిమా అద్భుతహా అంటూ రివ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానుల రికార్డుల వేట షురూ అయ్యింది. కాలర్ ఎగరేసి మరీ భారీ వసూళ్లు ఖాయం అని చెప్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడుంటూ మరికొంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హిట్ టాక్ తో ముందుకెళ్తుండటంతో ఈ సినిమా రైట్స్ ఎవరు దక్కించుకున్నారన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సలార్ రైట్స్ ను దక్కించుకుంది. దాదాపు రూ.160 కోట్లు పెట్టి మరీ సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.