Sai Pallavi : సాయి పల్లవి..ఫిదా బ్యూటీగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. ఇది హీరోయిన్ అయ్యాక. కానీ, చిన్నతనం నుంచి సాయి పల్లవికి హీరోయిన్ అవుతాననే ఆలోచనలేదట. కారణం తనకి తాను బాగోను అనే ఫీలింగ్. మొహంపై మొటిమలు..నేచురల్‌గా ఉండటానికి మాత్రమే ఇష్టపడే మనస్తత్వం. ఎవరికైనా తమ ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో ఒక అబద్రతభావనకి లోనవుతుంటారు. అలాగే సాయి పల్లవి కూడా. ముందు నుంచి సహజంగా కనిపించడానికి మాత్రమే ఇష్టపడేది.
ఇక సినిమాలలో హీరోయిన్‌గా అంటే నన్ను అసలు ఎవరైనా చూస్తారా..? అనే భయం ఉండేదట. హీరోయిన్ అంటే అందంగా కనిపించాలి. చిట్టి పొట్టి డ్రసుల్లో అందరిముందు తిరగాలి. లేదంటే తీసి పక్కనపెడతారు. ఇలాంటివన్నీ సాయి పల్లవిని బాగా ఇబ్బందిపెట్టాయట. అయితే, మొదటి సినిమా ప్రేమమ్ లో మేకప్ లేకుండా అయితే నటిస్తానని చెప్పడంతో దర్శకుడు ఓకే అన్నాడట. అందులో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ మాత్రమే అందరూ చూడటంతో బాగా ఆకట్టుకుంది.
ఆ తర్వాత తెలుగులో చేసిన ఫిదా. ఇందులో దర్శకుడు శేఖర్ కమ్ముల సాయి పల్లవికి మేకప్ లేకుండా దాదాపు అన్నీ సీన్స్‌లో చూపించాడు. అలా, ఈ బ్యూటీకి నేచురల్ హీరోయిన్ అని పర్ఫార్మెన్స్ పరంగా మేకప్ పరంగా పేరొచ్చింది. దాంతో సాయి పల్లవిని సహజంగా ఉంటేనే చూడటానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. సాయి పల్లవి కూడా సినిమాలలో గానీ, బయట గానీ ఎక్కువగా చీరల్లో, లంగా ఓణీల్లో గాగ్రా లాంటి ట్రెడీషనల్ వేర్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో మేకప్ వేసుకోకుండా నటించే విషయం గురించి ఇలా ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.
ఇప్పటివరకూ ఏ దర్శకుడూ ఈ సీన్‌లో నువ్వు మేకప్‌తో కనిపించాల్సిందే..అని ఇబ్బందిపెట్టలేదట. దాదాపు సాయి పల్లవితో సినిమా చేసిన వారు తాను సహజంగా కనిపిస్తానంటే సపోర్ట్ చేసిన వారే అని చెప్పింది.ఇక సాయి పల్లవి సినిమాలను కూడా చాలా నెమ్మదిగా కమిటవుతుంది. కథ, అందులో తన పాత్ర చాలా క్లీన్‌గా ఉంటేనే ఒప్పుకుంటుంది. ఏమాత్రం గ్లామర్ డోస్ ఎక్కువ ఉందనిపించినా నిర్మొహమాటంగా సినిమాను రిజెక్ట్ చేస్తుంది. చివరిగా సాయి పల్లవి గార్గి అనే సినిమాతో వచ్చింది. మళ్ళీ ఇంతవరకూ కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదు. అమ్మడు ఒప్పుకోవాలే గానీ భాషతో సంబంధం లేకుండా చాలా సినిమాలొస్తాయి. కానీ, సాయి పల్లవికి లెక్క కాదు ముఖ్యం. కథ మాత్రమే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.