Sai Pallavi : రామాయణ ఇతిహాసం ఆధారంగా తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆదిపురుష్ మినహా అన్ని సినిమాలు హిట్ అందుకున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రూపొందించిన ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆదిపురుష్ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇపపుడు మరోసారి బాలీవుడ్ రామాయణంతో ముందుకు రాబోతోంది. బాలీవుడ్ మూవీ దంగల్ ఫేమ్ డైరెక్టర్ నితేశ్ తివారీ డైరెక్షన్ లో రామాయణం తెరకెక్కబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ రాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ సినిమా గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వస్తున్న అప్డేట్స్ అందరిలో అంచనాలను పెంచేస్తోంది. ఈ క్రమంలోనే మేకర్స్ సైలెంట్ గా రామాయణం షూటింగ్ ను కానిచ్చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ లేకుండానే షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
యానిమల్ సూపర్ హిట్ తర్వాత రణ్ బీర్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణం. యానిమల్ లో ఫుల్ లెన్త్ యాక్షన్ సీన్స్ లో నటించిన రణ్ బీర్ రామాయణంలో రాముడిగా కనిపించనున్నాడు. దీంతో ప్రేక్షకుల అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు చాలా రోజుల గ్యాప్ తర్వాత న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి రామాయణం చేస్తోంది. ఈ మూవీతో ఈ బ్యూటీ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక కన్నడ స్టార్ హీరో యశ్ రావణాసురుడు క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ చెప్తూనే సైలెంట్ గా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. లేటెస్టుగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించారు. మరో పిక్ లో తన క్యారవాన్ నుంచి రణబీర్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సాయి పల్లవి సీత అలంకరణలో ఎంతో అందంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ ఆర్ రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ కమ్యూజిక్ అందిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.