Sai Pallavi : మన దగ్గర కూడా టాక్స్ షోస్‌కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జయప్రదం, లక్ష్మీ టాక్ షో, సౌందర్య లహరి లాంటి షోస్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత రానాతో నంబర్ 1 యారీ అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోస్, మీలో ఎవరు కోటీశ్వరులు, కొంచం టచ్‌లో ఉంటే చెబుతా, ఇప్పుడు అన్‌స్టాపబుల్. ఇవన్నీ బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నవే.
ఈ క్రమంలోనే సోనీ లివ్ వారు మరో సరికొత్త టాక్ షోను మొదలుపెట్టారు. దీనికి పాపులర్ పాప్ సింగర్ స్మిత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే, ఈ షోకి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, సాయి పల్లవి లాంటి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ వచ్చి ప్రోగ్రాం లో అన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలాగే, ఫిదా బ్యూటీ సాయి పల్లవి కూడా విచ్చేశారు.
ఇందులో ఆమె తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ విషయంలో చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు అంతటా బాగా వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్..ఈ ముగ్గురిలో మీకు ఎవరితో డాన్స్ చేయాలని ఉంది..? అనే ప్రశ్నకి సూపర్ ఆన్సర్ ఇచ్చి..ఆ ముగ్గురు హీరోల అభిమానులకి కిక్కిచ్చింది.
ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్..ఈ ముగ్గురూ కలిసి నాతో డాన్స్ చేస్తే బావుంటుంది..అంటూ పెద్దగా నవ్వేసింది. ఇప్పుడు సాయి పల్లవి చెప్పిన ఈ మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలతో వచ్చి ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ, ఆమెకి మాత్రం పర్ఫార్‌మెన్స్ పరంగా ఈ మూడు చిత్రాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.