Sadaa : సినీ ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరు ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతారో.. ఎప్పుడు ఎవరు కానరాని లోకాలకు వెళ్లిపోతారో ఎవరికీ తెలియదు. ఈ రోజు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రేపటిలోగా ఏ స్థితిలో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అలా ఎంతో మంది తారలు ఇండస్ట్రీలోకి వచ్చి అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుని ఆ తర్వాత తెరమరుగైనవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో దివంగత నటి ప్రత్యూష ఒకరు. తెలుగులో నటించింది అతి కొద్ది సినిమాలే అయినప్పటికీ ఈ భామ చెరగని ముద్ర వేసింది. తన నటనతో అందంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఒకవేళ ప్రత్యూష కనుక బ్రతికుంటే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రత్యూష అర్ధంతరంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది.
టాలీవుడ్ డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సదా. మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించింది సదా. నితిన్ హీరో గా వచ్చిన జయం మూవీ సదా కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో సదా కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. దీనితో నెక్స్ట్ ప్రాజెక్ట్ నాగలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించింది. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ కావడంతో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకుంది. వరుసగా టాలీవుడ్ లో ఛాన్సులు వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది సదా.
ఆ తర్వాత సదా దొంగ దొంగది, లీలామహల్ సెంటర్, మోనాలిసా, ఔనన్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మెట్స్, వంటి మూవీస్ లో నటించినా విజయాలు దక్కలేదు. ఇందుకు కారణం ఆమె స్టోరీ ఎంపిక అని పలు ఇంటర్వ్యూలలో సదా చెప్పుకొచ్చింది. ఇక సదా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉంటోంది. పలు టీవీ షోలకు గెస్ట్ గా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది.
అయితే ఒకప్పుడు సదా స్టార్ హీరోయిన్ కావడానికి మరో నటి అని తాజాగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఆ నటి చనిపోవడం వల్లే సదా స్టార్ నటి అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రత్యూష. ఇప్పటి జనరేషన్ కి ప్రత్యూష తెలియకపోవచ్చు కానీ.. ఆమె 80s కిడ్స్ కి బాగా తెలిసిన హీరోయిన్. మోహన్ బాబు హీరోగా నటించిన రాయుడు మూవీలో ప్రత్యూష మొదటి సారి ఇండిస్ట్రీ కి పరిచయం అయ్యింది.. ఈ మూవీలో మోహన్ బాబుకు కూతురిగా కనిపించింది. ఆ తర్వాత శ్రీరాములయ్య మూవీలో పనిమనిషిగా, ఉదయ్ కిరణ్ నటించిన కలుసుకోవాలని చిత్రంతో పాటు , స్నేహమంటే ఇదేరా సినిమాలో హీరోయిన్ గా నటించింది.
కానీ కొన్ని కారణాల వల్ల ప్రత్యూష చిన్న ఏజ్ లోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇదిలా ఉంటే తేజా డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన జయం మూవీలో నిజానికి హీరోయిన్ గా మొదట అవకాశం వచ్చింది ప్రత్యూషకేనట. ఆ తర్వాత కొంతకాలానికి ప్రత్యూష చమిపోవడంతో సదాకి ఆ అవకాశం వచ్చింది. ఇలా జయం మూవీ తో సదా స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ విషయం ఎవరో కాదు స్వయంగా ప్రత్యూష తల్లి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.