RJ Balaji : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రూపొందించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. సౌత్ నుంచి నార్త్ వరకు యానిమల్ కలెక్షన్ల సునామీని సృష్టించింది. నాన్న సెంటిమెంట్ తో వచ్చిన ఈ యాక్షన్ మూవీని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మూవీని చూసి ఎంజాయ్ చేశారు. అయితే కొన్ని సినిమాలు ఎంత పెద్ద హిట్ సాధించినా కొంత మందికి అస్సలు నచ్చవు. మరికొన్ని కనీసం కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయినా మాత్రం జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది. ఒక్కో మూవీది ఒక్కో ఫలితం ఉంటుంది. అందుకనే యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించినప్పటికీ ఈ మూవీపై పలు విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా తమిళ హీరో, డైరెక్టర్ ఆర్జే బాలాజీకి యానిమల్ మూవీ నచ్చలేదట. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
తమిళ హీరో, దర్శకుడు ఆర్జే బాలాజీ తెలుగువారికి సుపరిచితమే. మొన్నామధ్య నయనతార నటించిన అమ్మోరు తల్లి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బాలాజీ హీరో మాత్రమే కాదు మంచి కమెడియన్ కూడా. అయితే తాజాగా బాలాజీ యానిమల్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అసలు యానిమల్ సినిమా తనకు నచ్చనేలేదని చెప్పేశాడు. ఓ ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ..” నేను ఇప్పటి వరకు థియేటర్ లో యానిమల్ మూవీ చూడలేదు. ఆ సినిమాను చూడాలని కూడా నేను అనుకోవడం లేదు. నాకు తెలిసినవారు యానిమల్ మూవీ బాగుంది చూడమని సజెస్ట్ చేశారు. అయితే ఈ మూవీలో నాకు నచ్చని విషయం ఏమిటంటే ఒక అమ్మాయిని కొడుతుంటే, ఆమెను వేధిస్తుంటే ఆ సీన్స్ ను పెద్ద పెద్ద స్క్రీన్ ల మీద థియేటర్లలో ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సన్నివేశాలు చూసి నేను ఎంజాయ్ చేయలేను. కానీ యానిమల్ చూసి జనాలు ఆనందిస్తున్నారు, ఈ విషయమే నన్ను బాధిస్తోంది.
ఆడవారిపై ఇలాంటి హింసాత్మకమైన సీన్స్ ను చూసి ఎంజాయ్ చేయడం సరైన విషయం కాదు. ఇవి ప్రజలను ఏదో ఒక సందర్భంలో ప్రేరేపిస్తాయి. నేనైతే అలాంటి సీన్స్ ను నా చిత్రాల్లో అస్సలు పెట్టనివ్వను. ఇక మరీ దారుణమైన సంఘటన ఏమిటంలో యానిమల్ లో హీరో రణ్ బీర్ కపూర్ తన తోటి నటి తృప్తి డిమ్రిని తన షూ నాకమన్నాడట. ఇలాంటి సీన్స్ యూత్ ను పక్కదోవ పట్టిస్తాయి. అంటే ఆడవాళ్లతో అలాంటి పనులు కూడా చేయించడం తప్పేం కాదని వారు ఫీలవుతారు” అని బాలాజీ యానిమల్ గురించి తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.