Ritu Varma: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ భామలు చాలా అడ్వాన్స్ గా ఉంటున్నారు. గ్లామర్ షో విషయంలో నార్త్ ఇండియన్ భామలకి పోటీ ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో అవకాశాలు రావడమే కష్టంగా ఉంటే ఇప్పుడు అన్ని భాషలలో కూడా తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. గ్లామర్ షో చేస్తూ క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తూ విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో తెలుగులో పర్వాలేదనే విధంగా అవకాశాలు సొంతం చేసుకుంటూ నటిగా ప్రూవ్ చేసుకున్న తెలుగమ్మాయి రీతు వర్మ. ఈ అమ్మడు పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు బాద్ షా, ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. తరువాత నా రాకుమారుడు అనే సినిమాలో రాహుల్ రవీంద్రన్ కి జోడీగా నటించింది.
అయితే పెళ్లి చూపులు సినిమా ఆమెని నటిగా సక్సెస్ ఇచ్చింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ప్రతి ఏడాది ఈ బ్యూటీ నుంచి ఒకటి, రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళీ భాషలలో కూడా రీతు వర్మ నటిస్తుంది.
తెలుగులో ఈ బ్యూటీ చివరిగా గత ఏడాది శర్వానంద్ కి జోడీగా ఒకే ఒక జీవితం సినిమాలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు ఈ అమ్మడు కమిట్ అయ్యింది. అవి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కమర్షియల్ హీరోయిన్ అయిన తర్వాత రీతు వర్మ గ్లామర్ షో విషయంలో హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతుంది.
తాజాగా ఈబ్యూటీ ఎల్లో కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో నడుము అందాలు కనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఇవి వైరల్ గా మారుతున్నాయి. ఈ డ్రెస్ లో రీతు వర్మ ఎల్లోర శిల్పంలా ఉంది అంటూ కితాబు ఇస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.