RGV-VYOOHAM: ‘వ్యూహం’ రిలీజ్‌కి బ్రేక్.. సెన్సార్ సర్టిఫికెట్ నిరాక‌ర‌ణ‌

RGV-VYOOHAM: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లేటెస్ట్ పొలిటికల్ మూవీ వ్యూహం. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ అటు రాజకీయ వర్గాలలోనూ, ఇటు అభిమానులు..ప్రజల్లోనూ భారీగా అంచనాలను పెంచేసింది. వైఎస్సార్ హెలికాఫ్టర్ క్రాష్ తర్వాత ఎవరి వ్యూహం ఎలా ఉండింది అనే నేపథ్యంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన విధానం..ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నిటినీ కలిపి ఆర్జీవీ ఆయన కోణంలో వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారు.

మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోంది. ఆర్జీవీ ఇంతకముందు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటీనటులు ఒరిజిన‌ల్‌ పాత్రలతో ఉండటం కారణంగా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీంతో టైటిల్ ని కూడా అప్పుడు మార్చారు. ఇక ఇప్పుడు ‘వ్యూహం’ సినిమా కూడా రాజ‌కీయ నాయ‌కుల వాస్త‌విక‌ పాత్ర‌ల‌తో తెర‌కెక్కించిన కారణంగా సెన్సార్ సభ్యులు భావించారట. అంతేకాదు, ఆర్జీవీ నాయ‌కుల పేర్ల‌ను కూడా య‌థాత‌థంగా పెట్ట‌డం వల్ల సెన్సార్ ప్ర‌తినిధులు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారట.

rgv-vyooham-Release break.. Censor certificate rejection

RGV-VYOOHAM: ఆర్జీవీ టీం రివైజింగ్ క‌మిటీని ఆశ్ర‌యించిన‌ట్టు లేటెస్ట్ న్యూస్

ఈ సినిమాలో వాస్త‌విక జీవితంలోని నాయ‌కుల పాత్ర‌ల‌ను య‌థాత‌థంగా తెర‌పై చూపించ‌డం వల్ల సెన్సార్ అభ్యంత‌రం చెప్పింది. వైఎస్ఆర్ మరణవార్త విని చంద్రబాబు ఆనందపడినట్టు.. జగన్, వైఎస్ భారతి, విజయమ్మ, రోశయ్య వంటి పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. వ్యూహం వీక్షించిన సెన్సార్ టీం ఈ కారణాల వల్లే స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. దాంతో ఆర్జీవీ టీం రివైజింగ్ క‌మిటీని ఆశ్ర‌యించిన‌ట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

13 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

15 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.