Renu Desai : టాలీవుడ్ స్టార్ హీరో , ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలు పెద్దగా చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ పవన్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఎప్పుడూ అకీరా, ఆద్యల గురించి తమ ఫ్యామిలీ గురించి నెట్టింట్లో పోస్టులు పెట్టే రేణు దేశాయ్ తాజాగా తన పిక్ ను షేర్ చేసింది. ఆమె పెట్టే ప్రతి పోస్టుకు పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుంటారు. తాజాగా పెట్టిన ఫోటోపైన పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని పెట్టిన పోస్ట్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది రేణు దేశాయ్. తనను టార్చర్ చేయవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చింది.
తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి రేణు దేశాయ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తానే తన స్వహస్తాలతో ప్రసాదం వండానని , ప్రత్యేక పూజలు చేశానని తెలిపింది. ఇలా పూజలు చేసేప్పుడు తన చేత్తో ప్రాసంద చేయడం అంటే ఇష్టమని నటి చెప్పుకొచ్చింది. అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ “వదినగారు మీరు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి వుంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన మనసు తెలుసుకోకుండా వెళ్లిపోయారు. చేశారా ఈరోజు ఆయన వాల్యూ ఏంటో మీకు తెలిసింది. ఏది ఏమైనా విధే ఇదంతా సైడ్ చేస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు కానీ వదినమ్మను మేము మిస్ అవుతున్నాం” అంటూ పోస్టుపై కామెంట్ చేశాడు.
దీనికి రేణూ దేశాయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ” మీకు కొంచమైనా బుద్ది ఉందా. ఉంటే ఇలా అనరు. ఆయన వెయిట్ చేయకుండా నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయకండి. ఇలాంటి కామెంట్స్ పెట్టకండి”అని సమాధానం ఇచ్చింది. ఇదిలా ఉంటే మరో నెటిజన్ సూపర్ అమ్మ మీరు.. అన్న మీ దగ్గర లేకున్నా మీరు పూజలు చేస్తున్నారు అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా ? అంటే ఏంటీ? నాకంటూ నా లైఫ్ ఉండదా? మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను టార్చర్ చేస్తున్నారు” అని రేణు దేశాయ్ తన ఆవేదన వ్యక్తంచేశారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.