Road safety: ఇంటి నుంచి బయట పడితే మళ్ళీ ఇంటికి సురక్షితంగా చేరుతామన్నది ప్రస్తుత కాలంలో ఓ ప్రశ్నార్ధకమే. ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఆ రోజుకు ఇంటికి చేరామా అన్నదే ప్రస్తుతం అందరి ముందున్న అసలు ఛాలెంజ్‌గా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న వాహన ప్రమాదాలే ఈ సందేహానికి అసలు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏ రోడ్డులో చూసినా ఒక్కటైనా ప్రమాదం కనిపించక మానడం లేదు. ముఖ్యంగా బైకర్లు ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్ ల బారిన పడుతున్నారు. నిండు జీవితాన్ని కోల్పోతున్నారు.
ఈ బైకర్లు ఎక్కువగా ప్రమాదాల బారిన పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చర్చిద్దాం. ప్రతి మనిషికి సవాలక్ష టెన్షన్లు ఉంటాయి. ఇంట్లో, ఆఫీసులో పని విషయంలో కొలీగ్స్‌తో బంధువులతో ఎన్నో ఇబ్బందులు సమస్య లు ఉంటాయి. కానీ ఏ సమస్యను అక్కడే వదిలేస్తే ఏ తంటా ఉండదు. కానీ చాలా మంది వాహనాలను నడిపేవారు ఇంటి విషయాలన్నింటిని ఆలోచిస్తూ మానసిక మైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇంట్లో భార్య – భర్తల మధ్య చిన్నపాటి గొడవ మొదలైనప్పుడు అదే ఆలోచనలో వెహికిల్స్ డ్రైవ్ చేస్తున్న సమయంలో వెనక నుంచి వినిపించే హారన్ కూడా మైండ్‌కి చేరకపోవడంతో అటువైపుగా వచ్చే వాహనదారుడిని ఢీ కొనడమో లేదా వారే వచ్చి మిమ్మల్ని ఢీ కొట్టడమో జరగడం వల్ల సడెన్ బ్రేక్ వేయడం వల్ల స్వీడ్ కంట్రోల్ కాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి.
మరి కొందరేమో ఇంట్లో జరిగిన గొడవనూ బైక్ మీద కంటిన్యూ చేస్తూ వస్తుంటారు. అదే గొడవ గురించి భార్యా భర్తలు వాధించుకుంటూ ఓవర్ యాక్షన్ కు వెళ్లి పోతుంటారు. అలా మాట్లాడే సమయంలో ఒత్తిడి పెరిగి బైక్‌ను కంట్రోల్ చేయలేక ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక మరికొంత మంది మహానుభావులు ఆఫీసుకు వెళ్లాలని తెలుసు కానీ టైం మేనేజ్మెంట్ లేక లేజీగా ఇంట్లోనే గంటల తరబడి సమయాన్ని వృధా చేసి ఏదో ఘనకార్యం సాధించామని ఫీల్ అవుతూ ఆఫీస్‌కు లేటైందన్న కంగారులో యమ జోరు మీద బండి నడుపుతుంటారు. బాస్ తిడతాడనో, మీటింగ్‌కు లేట్ అవుతామనో నానా యాతన పడుతూ ఏకంగా ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకుండా బండిని స్వీడ్ గా నడపడం ఇక మరీ ముఖ్యమైన విషయం తల్లి తండ్రులు మైనర్స్‌కు వెహికిల్స్ ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదు. సరిగ్గా డ్రైవింగ్ రాకుండా, రూల్స్ తెలియకుండా..బండి తీసుకొని రోడ్లపై రావడం కంగారులో యాక్సిడెంట్ చేయడం కూడా ప్రధాన కారణం. తోలుతారు.
ఆ సమయంలోనే ఏదైనా ఫోన్ వస్తే ఇక అంతే సంగతులు వారి డ్రైవింగ్‌కు ఓ పెద్ద దండం పెట్టాల్సిందే. సిగ్నల్ జంప్ చేయడంతో పాటు ఓ చేత్తో ఫోన్ మాట్లాడటం మరో వైపు డ్రైవింగ్ చేయడం చేస్తూ వీడు గ్యారెంటీగా ఇంటికి వెళ్లడు అనిపిస్తుంది చూసే వారికి. నిజానికి ఈ నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. సిగ్నల్స్ పట్టించుకోకుండా డ్రైవ్ చేయడం వల్ల అటుగా వచ్చే వాహనాలు వచ్చే వాహనాలకు తగిలి బండి స్కిడ్ అవుతుంది. దీంతో కాలో చేయో విరగడమే కాదు ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. ఇది చాలా చిన్న విషయమే కాస్త ఆగితే పోయేదానికి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మరికొంత మంది మహానుభావులు. డ్రైవ్ చేస్తూ పాటలు వింటుంటారు. నార్మల్ సమయాల్లో ఓకే కానీ ఈ మధ్య టెక్నాలజీ పుణ్యమై డీటీఎస్ సౌండ్స్ వినిపించే హెడ్‌సె ట్‌లు అందుబాటులోకి రావడంతో పక్కన ఎవరు ఉన్నారు ఎవరు హారన్ కొడుతున్నారో పట్టించుకోకుండా అసలు బైక్ నడుపుతున్నామన్న కామన్ సెన్స్‌ను కూడా మరిచిపోతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. మరి కొంత మంది చాలాన్స్ పెండింగ్‌లో ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టించాలనే తొందర్లో అతి వేగంగా వాహనాలను నడుపుతున్నారు.
హెల్మెట్ లేకుండా వెళుతున్న క్రమంలో కూడా ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే తప్పించుకునే సమయంలోనూ యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నా యి. ఇక మరికొంత మంది మహానుభావులు మార్గం మధ్యలో రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తే చాలు వాటిని చూస్తూనే డ్రైవింగ్ చేస్తుంటారు. ఆ ఏమరపాటులో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు నగరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
పైన పేర్కొన్న విషయాలన్ని అందరికీ తెలుసు కానీ ఆచరించాలంటేనే మహా నిర్లక్ష్యం. ప్రాణం పోవాలంటే ఒక సెకను చాలు కానీ అదే ప్రాణం నిలబడాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నవ మాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడి చదువు చెప్పించి ఓ ప్రయోజకునిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రల కళ్లల్లో కన్నీటిని చిందనివ్వకండి. మీ ఏమరపాటు, నిర్లక్ష్యం, పట్టించుకోని తనం, మీ నిండు జీవితానికి ఓ శాపం అని మరిచిపోకండి. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఒక్కసారి బండి ఎక్కితే మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ సమస్యను గుర్తు చేసుకోకుండా ప్రత్యామ్నాయ ఆలోచనల వైపు మీ మెదడు పరిగెత్తేలా చూడండి.
ఆఫీసుకు లేటైందని బాధపడకుండా ఒక గంట ముందే లేవండి. చాలాన్లు కట్టలేదని పారిపోకుండా కాస్త సమయాన్ని వెచ్చించి చాలాన్లు క్లియర్ చేయండి. ప్రాణం కన్నా డబ్బులేమీ గొప్ప కాదు. వెయ్యి రూపాయలతో పోయే దానిని యాక్సిడెంట్ల కారణంగా లక్షల రూపాయలు ఖర్చు చేసే ఆలోచనకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. మ్యూజిక్ వినడం మంచిదే కానీ డ్రైవ్ చేసేటప్పుడు తప్పు. మీ ఎంజాయ్‌మెంట్ మరొకరికి శాపం కాకూడదు. ఈ చిన్న విషయాలను మీ బుర్రలోకి ఎక్కించుకుంటా సగానికి సగం ప్రమాదాలను నియంత్రించవచ్చు. ఆనందమైన జీవితాన్ని నూరేళ్లు అనుభవించవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.