Categories: Tips

Insomnia: నిద్రలేమి సమస్యకు ప్రధాన కారణాలేమిటి

Insomnia: ఒకప్పుడు కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర పోతున్నారంటే అబ్బ వీరు ఎంత ఆనందంగా ఉన్నారో వీరంత అదృష్టవంతులు ఎవరూ లేరు కదా అని అందరూ అనుకునేవారు. మనిషి జీవితానికి ఇంతకన్నా కావాల్సింది ఏముంది అని భావించేవారు. పచ్చటి పొలాలు, పాక, పెంకుటిళ్లు, భార్యలు ఇంట్లో ఉంటూ రుచికరమైన వంటకాలు వండి వారుస్తుంటే, భర్తలు పొలం పనులకు వెళ్లి ఇంటికి ఆర్ధిక భరోసాను కల్పించేవారు. ఈ జీవితం నిజానికి మనిషికి ఎంతో ప్రశాంతతను అందించేది.

కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆలోచనలు, అలవాట్లు అన్నీ మారిపోయాయి. ఆహార నియమాలు, ఉద్యోగాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. పాశ్చ్యాత్య పోకడలు, మోడ్రన్ కల్చర్ మనిషిని తమ బానిసలుగా మార్చాయి. సంపాదన ఒక్కటే మనిషి మనుగడకు మూలం అనేంతగా మనిషి మారిపోయాడు. తద్వారా ప్రశాంతమైన జీవితానికి దూరంగా గజిబిజి గందరగోళాల నడుమ, టార్గెట్ల వేటలో మనిషికి అత్యంత ముఖ్యమైన నిద్రను కూడా పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

reasons for insomnia

ఇప్పుడు ఇంట్లో భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు ఉసూరు మంటూ ఉదయమే వెళ్లిపోతారు. ఓ వైపు పిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకు, ఎంటర్‌టెయిన్‌మెం ట్‌కు, లగ్జరీకి కావాల్సిన డబ్బులు సంపాదించే పనిలో వీరు నిమఘ్నమైపోతు న్నారు. కానీ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. దానికి కారణం ఆలోచనలు. వర్క్ టెన్షన్, సంపాదించేయాలన్న అటెన్షన్‌. కాస్త కళ్లు మూసుకున్నా రేపటి పని కళ్ల ముందు కనిపిస్తోంది.

రేపటి గురించి కూడా నేడు రాత్రే ఆలోచించేంత టెన్షన్ మనిషి తన బుర్రలోకి ఎక్కించుకుంటున్నాడు. మహిళలైతే ఓ వైపు ఇంటి పనులు మరో వైపు ఆఫీస్ పనుల్లో నిమగ్నమై కంటి నిండా నిద్రలేకపోతున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పెద్దలనే కాదు పిలల్లను నిద్రలేమి సమస్యలు వేధిస్తున్నాయి.

వయస్సుతో సంబంధం లేదు ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు నిద్ర లేమి సమస్యకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. శారీరక, మానసిక కారణాలు కూడా నిద్రలేమికి దారితీస్తున్నాయి. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు కంటి నిండా నిద్రపట్టక సతమతమవుతున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టక మనోవేధనకు గురవుతున్నారు. మనిషి తనకు అవసరమైనంత నిద్రపోకపోవడం వల్ల చిరాకు, మానసిక ఆందోళన, కోపం, డిప్రెషన్‌ వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతుంటాడు.

ముఖ్యంగా నైట్ షిఫ్టుల్లో పని చేసేవారు నిద్రలేమి కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతే కాదు షుగర్ వంటి వ్యాధులు వేధించడంతో పాటు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. నిజానికి మనిషి ప్రతి రోజు 8 గంటలు పడుకోవాలి. ఇండియాలో అయితే రాత్రి వేళల్లో నిద్రపోయే అలవాటు కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతోంది. మన శరీరం అదే విధంగా పనిచేస్తూ వస్తోంది. కానీ కార్పోరేట్ ఆఫీసుల కల్చర్‌ కారణంగా రాత్రిళ్లు మేల్కుని పగలు నిద్రపోవడం మొదలు పెట్టారు. దీనివల్ల మన జీవన విధానంలో ఒక్కసారిగా ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. అలవాటు లేని వారు నిద్రలేమితో బాధపడుతుంటే అలవాటు చేసుకున్నవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఇక పిల్లల విషయానికి వస్తే ఒకప్పుడు ఇంటి చుట్టు పక్కన పిల్లలతో ఉదయమంతా ఆడుకుని రాత్రిళ్లు అలసి సొలసి పడుకునేవారు. మళ్లీ ఉదయం లేచి స్కూళ్లకు వెళ్ళి అక్కడ పిల్లలతో ఆడుకుని చదువుకునేవారు. కానీ నేడు కాంక్రీట్ జంగిళ్లగా మారుతున్న నగరాలతో పాటు పల్లెల్లోనూ ఎక్కడూ పిల్లలు కలిసికట్టుగా ఆడుకుంటున్న పరిస్థితులు కానరావడం లేదు. కారణం స్మార్ట్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు. ఉదయం లేదు సాయంత్రం లేదు కరోనా లాక్‌డౌన్ సమయాల్లో ఏకంగా 5 నుంచి 6 గంటల వరకు స్మార్ట్‌ ఫోన్‌లకు ఆన్‌లైన్‌ స్టడీస్ పేరుతో అతుక్కుపోయేవారు.

ఆ అలవాటు ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నారన్నా, అన్నం తినిపించాలన్నా స్మార్ట్ ఫోన్‌ల మంత్రాన్నే వాడుతున్నారు. ఇక యుక్త వయస్సుకు వచ్చిన పిల్లలేమో స్మార్ట్‌ ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. హింసను ప్రేరేపించే ఆటలను చరవాణుల్లో ఆడుతూ తమ విలువైన కాలాన్ని స్మార్ట్‌గా నాశనం చేసుకుంటున్నారు. మరికొంత మంది పిల్లలు లేట్‌టైం కూడా ఫోన్‌ లోనే మునిగిపోతున్నారు. ఫోన్‌ల నుంచి వెలువడలే బ్లూ కలర్ రేస్ వారి లేలేత కళ్లపై పడి నిద్రలేమి సమస్యను ఏరికోరి మరీ తెచ్చుకుంటు న్నారు. చాలా మంది నిద్ర పట్టడం లేదు అందుకే ఫోన్ చూస్తున్నాము అంటారు. కానీ అసలు కారణమేమిటంటే ఫోన్‌లు గంటల తరబడి చూడటం వల్లే నిద్ర సమస్య వేధిస్తోందని.

ఇక మరికొంత మంది స్త్రీ, పురుషులు హై ఫై లైఫ్‌కి అలవాటు పడి లేట్ నైట్ కల్చర్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. పార్టీలు, పబ్బులంటూ తెల్లవారు జాము అయ్యే వరకు వారి సమయాన్ని ఆ చీకటి గదుల్లో గడుపుతూ వారి ఆయుష్షును వారే తగ్గించుకుంటున్నా రు. పార్టీ పూర్తైన తరువాత పగలు ఎక్కువ సేపు నిద్రపోయినా రాత్రి నిద్రపోయిన దానితో ఏమాత్రం సరితూగదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు ఈ మధ్యన మిడ్‌నైట్‌లు ఎక్కువ మొత్తంలో మసాలా పుడ్‌ను తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలు. దానివల్ల అసిడిటీ ఏర్పడి సరిగ్గా నిద్రపట్టక సతమతమవుతున్నారు. వైద్యులు చెప్పిన మేరకు రాత్రిళ్ళు మిత ఆహారం తీసుకోవడం వల్ల చక్కని నిద్ర సొంత చేసుకోవచ్చు. కానీ ఈ విషయం తెలిసినా ఎవ్వరూ పట్టించుకోరు.

ఏది ఏమైనా ఒక్కసారి ఆరోగ్యం మన చేతి నుంచి జారిపోతే మళ్లి సొంతం చేసుకోవడం చాలా కష్టం. అది నిద్రైనా మరేదైనా దానికి తగినంత సమయం కేటాయించాలంటే మన జీవనశైలిలో మార్పులు రావాలి. ఒకప్పుడు రాత్రిళ్లే కాదు మధ్యాహ్నం వేళలోనూ హాయిగా గురకపెట్టి మరీ నిద్రపోయేవారం కానీ నేడు ఒక్క పూట పడుకోవడానికే నానా మాత్రలు మింగాల్సి వస్తోంది. కాబట్టి టెన్షన్‌స్ ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి వాటిని పక్కన పెట్టి కాస్త మెడిటేషన్ చేసినట్లైతే మన:శాంతిగా నిద్రపోవచ్చు.

పిల్లలు వారంతట వారు తెలుసుకోలేరు కాబట్టి పెద్దలు వారిని గౌడ్ చేయాలి. వీలైనంత వరకు వారితో స్మార్ట్ ఫోన్‌ల వినియోగాన్ని తగ్గించాలి. నలుగురు పిల్లలతో ఎలా ఆడుకోవాలో నేర్పించాలి. సమాజం తీరుతెన్నులు నేర్పించాలి. స్త్రీలు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మీరు టెన్షన్‌గా ఫీల్ అయ్యే కాస్త పనిని మీ జీవిత భాగస్వామి కి అప్పజెప్పాలి. అప్పుడే మీరు హాయిగా పడుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి ఉండదు కంటి నిండా నిద్రపోవాలని.

 

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

7 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

9 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.