Cyber Crime: సైబర్ నేరగాళ్లతో మోసపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..?

Cyber Crime: కరోనా సంక్షోభంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదు అన్న ఉద్దేశంతో మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో ఉంటూనే అన్ని లావాదేవీలను చక్కదిద్దుకునే వీలుగా ఈ సేవలను తీసుకువచ్చాయి బ్యాంకులు. ఉద్దేశం మంచిదే అయినా అది సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతోంది. మోసపూరిత కాల్స్‌, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లలో ఫ్రాడ్ వల్ల తమ ఖాతాలోని డబ్బులను పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు అధికమవుతుందే కానీ తగ్గడం లేదు.

ప్రతి రోజు వందల సంఖ్యలో ఇలా ఆన్‌లైన్ మోసాలపాలై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. ఓటీపీలు చెప్పవద్దని, బ్యాంకు డీటెయిల్స్ ఎవ్వరికి ఇవ్వద్దని అటు బ్యాంకు నిర్వాహకులు, పోలీసులు నెత్తి నోరు బాదుకుని చెప్పినా ఇంకా కొంత మంది వాటిని మరిచి ఒక్క క్షణం ఆదమరిచి తమ ఖాతాలోని సొత్తును వేరే వారు దోచుకునే ఛాన్స్ ఇస్తున్నాము. ఇంతకి లోపం ఎక్కడుంది. ఎందుకు ఇంత ఈజీగా కేటుగాళ్లు మన జేబులకు చిల్లు పెడుతున్నారు. నిజంగా ఒక్క ఓటీపీ చెబితే తమ డబ్బంతా హుష్‌కాకి కావాల్సిందేనా అంటే అవుననే చెప్పాలి తాజా సంఘటనలు చూస్తుంటే.

reasons for cyber crimes now a days

ఒక అతన ప్రైవేటు ఉద్యోగి. నిత్యం బిజీ బిజీగా ఉంటాడు. అప్పటికే పర్సనల్ లోన్‌ తీసుకుని ఉన్నాడు. ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాడు. ఈ క్రమంలో చోర వీరులు తెలివిగా ఫోన్‌లు చేసి లోన్‌లు ఇస్తామని. బ్యాంకుకు రావాల్సిన పనిలేదని ఇంట్లో ఉండే ఫోన్‌లో డీటైల్స్ చెబితే సరిపోతుందని కల్లబొల్లి మాటలను వల్లెవేస్తారు. ఇదే చేశాడు సదరు ఈ ఉద్యోగి విషయంలో. తన మానాన తాను పని చేసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు తక్కువ ఇంట్రెస్ట్‌కు లోన్‌లు ఇస్తామని మీకు ఎలాంటి పని లేకుండా ఆన్‌లైన్‌లో డబ్బులను పంపిస్తామని చెప్పారు. దీంతో ఇదేదో బాగుంది కదా. బ్యాంకుకు వెళ్లి క్యూ లైన్‌లలో నిలబడాల్సిన పని లేదుగా అని భావించి మెల్లిగా వారి మాయ ఉచ్చులో పడిపోయాడు.

అంతే సంగతులు మీకు లోన్ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉంది. ఆ బ్యాంకుకు ఆదార్ లింక్ ఉందా ఫోన్ లింక్ ఉందా ఒకసారి మీ నంబర్ నుంచి మరో నంబర్‌కు మనీ సెండ్ చేయండి అంటూ మెల్లిగా ఫోన్‌ను, సదరు వ్యక్తిని ట్రాప్ చేశారు. అంతే సంగతులు. మీ డబ్బులు క్షణాల్లో పడతాయని ఫోన్ కట్ చేశారు. ఆ తరువాత లోన్ డబ్బులు కాదు కదా అకౌంట్‌లో ఉన్న సొత్తును కూడా స్వాహా చేశారు ఆ నేరగాళ్లు. దీంతో సైబర్ క్రైంకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసినా రెండు నెలల తరువాత పోగొట్టుకున్న సొత్తులో కేవలం ఒక భాగాన్ని మాత్రమే సదరు బాధితుడు పొందాడు. ఇలా పర్సనల్ లోన్‌లని తక్కువ ఇంట్రెస్ట్‌ అని ఓటీపీలు, ఫోన్ రికార్డులు అందిస్తే అసలుకే మోసం వస్తుందని ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు.

మరో సంఘటన మరింత మాయగా ఉంటుంది. తన 24 ఏళ్ళ యువత ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఉన్నంతలో హ్యాపీగా ఉంటోంది. ఈమె పైన సైబర్ నేరగాళ్ల నజర్ పడింది. పర్సనల్ లోన్ ఇస్తామని ఆశ చూపారు. ఎలాగో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న సదరు యువతి మంచి ఆఫర్ కదా వదులు కోవడం ఎందుకని టెమ్ట్‌ అయ్యింది. అంతే ఇక ఆ యువతికి మాయ మాటలు చెప్పి మెళ్లిగా ఆమె బ్యాంక్ డీటైల్స్‌ను తెలుసుకున్నారు.

ఓటీపీ వస్తుంది మీరు కన్ఫామ్ చేయండి అంటూ చెప్పడంతో ఆ ఓటీపీని చెప్పేసింది. ఇంకేముంది గంట సమయంలో వరుసగా ఆమె క్రెడిట్ కార్డులోని డబ్బులన్నింటినీ స్వాహా చేశారు కేటుగాళ్లు. ఇదే విధంగా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మీరు ఈఎంఐ కట్టలేదు, లేటు పేమెంట్ కింద అధిక ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అంటూ హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఎంతో కమాండింగ్‌ గా మాట్లాడుతూ ఎదుటివారిని మోసం చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. వారి మాటతీరును బట్టి కేటుగాళ్లా కరెక్టు కస్టమర్ కేర్ సర్వీస్ వ్యక్తులా అన్నది గుర్తించక చాలా మంది ఇదే విధంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ ద్వారా నష్టపోయారు.

నిజానికి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ మన జీవితాన్ని ఎంతో సునాయాసంగా మార్చాయి. ఇంట్లో ఉంటూనే ఫోన్‌లో ఆపరేటింగ్ చేసే విధంగా అన్ని రకాల సదుపాయాల ను బ్యాంకులు కల్పించాయి. కానీ కొంత మంది సైబర్ నేరగాళ్లు, హై ఎండ్ టెక్నాలజీతో బ్యాంక్ ఎకౌంట్‌లను హ్యాక్ చేస్తూ అమాయకుల డబ్బులను దండుకుంటున్నా రు. అయితే ఆ ఛాన్స్‌ కూడా మనమే ఇస్తున్నామనడం లో ఎలాంటి సందేహం లేదు.

మనం ఏదో మైమరచి పనుల్లో నిమగ్నమైన సమయంలో ఇలాంటి కాల్స్ వస్తే గుడ్డిగా నమ్మేయకుండా కాస్త సమయం తీసుకుని ఆలోచించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా చేసిన వారు ఎవరు ఏ బ్రాంచ్ నుంచి చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇప్పటికే బ్యాకుంలు ఓటీపీలు చెప్పకండి, బ్యాంక్ డీటైల్స్ ఇవ్వకండి అంటూ ప్రకటనలు చేస్తున్నా అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తూ మోసపోతున్నారు. కాబట్టి వీలైనంత వరకు పర్సనల్ లోన్స్ తీసుకోవాలనుకునే వారు కాస్త శ్రమ అని అనుకోకుండా బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లండి. అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకొని లోన్‌లు తీసుకోండి దీని వల్ల ఎలాంటి నష్టం లేకుండా మీ అవసరాన్ని తీర్చుకోవచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

7 days ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

7 days ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

7 days ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

3 weeks ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 month ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

2 months ago

This website uses cookies.