Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆదిపురుష్ సినిమా వివాదాలలో ఇరుక్కుంది. సినిమా టీజర్ ని ఎంతో గ్రాండియర్ గా హాలీవుడ్ రేంజ్ లో ఆవిష్కరించిన కూడా ప్రధానంగా క్యారెక్టర్స్ ని డిజైన్ చేసే విధానం అంతులేని వివాదాలకు కారణం అయ్యింది రామాయణం అంటే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఇతిహాస గ్రంథం. రామాయణంలో రామ, వాన పాత్రల నుంచి ఎన్నో అంశాలని ప్రజలు నేర్చుకుంటారు.
మంచికి ప్రతీకగా రాముడి పాత్రని చూపిస్తే, ఒక మనిషి ఏం చేయకూడదు అనేదానికి ఉదాహరణగా రావణ పాత్రని చూపిస్తారు. అలాగే హనుమంతుడి పాత్రని భక్తి, విశ్వాసానికి ప్రతీకగా చూపిస్తారు. అలాగే వాల్మీకి రామాయణంలో పాత్రల స్వభావం, చిత్రణ చాలా చక్కగా వర్ణించారు. అసలు రాముడు ఎలా ఉంటాడు. అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలని స్పష్టంగా విడమరిచి చెప్పారు. అలాగే రావణుడి పాత్రని కూడా ఎక్కడా కూడా రాక్షసుడు తరహాలో చిత్రీకరించే ప్రయత్నం చేయలేదు. పరమ శివభక్తుడుగా రావణుడిని చూపించారు.
అయితే కేవలం అతనిలోని అహం రావణ పతనానికి కారణం అయ్యిందనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఇండియాలోనే శ్రీలంక నేపథ్యం ఉన్న తమిళులు రావణుడిని దేవుడిగా కొలుస్తారు. బ్రాహ్మణ వర్ణంలో పుట్టినా కూడా నిమ్నకులాలకి అండగా నిలబడిన గొప్ప వ్యక్తిగా చూస్తారు. కేవలం కొంతమంది కావాలని అతనిని రాక్షసుడుగా చిత్రీకరించారని అంటూ ఉంటారు. ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే ఒక్క రాముడి పాత్రన్నీ కరెక్ట్ గా చూపించారు. అయితే అక్కడ కూడా రాముడు తోలు వస్త్రాలు, చెప్పులు ధరించినట్లు టీజర్ లో చూపించారు. అలాగే హనుమంతుడిని ఒక కోతిగా చిత్రీకరించారు.
అలాగే హనుమంతుడు ఓ చోట తోలు వస్త్రాలు ధరించినట్లు చూపించారు. నిజానికి హనుమంతుడు కాషాయ వస్త్రాలు ధరిస్తాడు. అలాగే రావణుడి పాత్ర చిత్రణ కూడా పూర్తిగా రాక్షసత్వం నిండిన వ్యక్తిగా చూపించారు. అతని రూపం కూడా హిందూ పురాణాలలో చూపించిన రావణుడి పాత్రకి ఏ మాత్రం పొంతన లేదు. అలాగే రావణుడు పుష్పకవిమానం మీద ప్రయాణం చేస్తాడు. కానీ టీజర్ లో ఒక భయానక రాక్షస పక్షిపై కూర్చొని ఆకాశమార్గంలో ప్రయాణం చేసినట్లు చూపించారు.
రామాయణం నుంచి కథని సంగ్రహించిన అందులోని పాత్రల చిత్రణలో ఎక్కడా కూడా గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకోలేదు. ఇంతకాలం హిందువులు అందరూ రామ, రావణులు, అలాగే రామాయణంలో ఇతర పాత్రలన్నింటిని కూడా మానవ రూపంలోనే చూస్తారు. గత సినిమాలు, సీరియల్స్ అలాగే వర్ణ చిత్రాలు అన్ని కూడా రామాయణంలోని పాత్రలు అన్నింటిని కూడా హిందూ సంప్రదాయాలకు లోబడి ఉంటాయి. అయితే ఆదిపురుష్ సినిమాలో మాత్రం ఓం రౌత్ రామాయణంలో అన్ని పాత్రలని తన ఊహాశక్తి జోడించి, రామాయణాన్ని, అందులో కథని తాను అర్ధం చేసుకున్నదాని ప్రకారం మార్పులు చేసుకొని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో మానవ, రాక్షస, జంతు రూపాలని టీజర్ లో చూపించారు.
వానర సైన్యాన్ని పూర్తిగా అడవి జంతువులైన కోతుల మాదిరిగానే చూపించారు. అలాగే రావణ సైన్యాన్ని పూర్తిగా భయానకమైన రాక్షససైన్యంగానే చూపించారు. కేవలం రామ, లక్ష్మణులని మాత్రమే మానవ రూపంలో చూపించారు. ఇలా పాత్రల చిత్రణ అంతా సరికొత్త కోణంలో ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే ఈ ప్రయత్నం హిందుత్వ విధానాలని, వందలాది సంవత్సరాలుగా భారతీయ హిందువులు సృష్టించుకున్న సంప్రదాయాల అడ్డుగోడలు దాటి తెరకెక్కించారు. ఈ నేపధ్యంలో ఇప్పటికి రామాయణాన్ని జరిగిన కథగా భావించే భారతీయులలో చాలా మంది ఆదిపురుష్ టీజర్ పై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే విమర్శలు చేస్తున్నారు. ఈ కారణంగా ఆదిపురుష్ వివాదాలకి ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. మరి ముందు ముందు ఈ ఆదిపురుష్ సినిమాపై హిందుత్వ వాదులు ఏ స్థాయిలో తమ వ్యతిరేకత చూపిస్తారు అనేది చూడాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.