RC 15 : ఈ మూడు టైటిల్స్‌లో ఏది ఫిక్సైనా బ్లాస్టే..

RC 15 : మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనుకున్న క్రియేటివ్ జీనియస్ శంకర్ ఎట్టకేలకు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా, శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కియారా అద్వానీ చరణ్‌కి జోడీగా.. అంజలి, సునీల్, ఎస్.జె సూర్య, జయరామ్, శ్రీకాంత్, నవీన్ చంద్ర లాంటి వారు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఇందులో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఓ లుక్ లీకై సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.

rc-15-Which of these three titles is Fixina Blaste..

అయితే, RC 15 అని ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే వర్కింగ్ టైటిల్‌గా పిలుచుకుంటున్నారు. అంటే ఈ మూవీ చరణ్ కెరీర్‌లో 15వది కావడమే. కానీ, అసలు టైటిల్ ఏం పెట్టబోతున్నారో అని అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ మొదలై ఏడాది దాటింది. అయినా ఇప్పటివరకూ సినిమా టైటిల్ ఏంటనేది క్లారిటీ లేదు. కానీ, తాజాగా మూడు టైటిల్స్ మేకర్స్ చర్చించుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఆ మూడు టైటిల్స్ చరణ్-శంకర్ సినిమాకి హైలెట్‌గా అనిపిస్తున్నాయి. శంకర్ సినిమా అంటేనే టైటిల్ విషయంలో ఎంతో చర్చ జరుగుతుంది. మరి టాలీవుడ్‌లో అది కూడా మెగా హీరోతో సినిమా అంటే ముందు అందరూ మాట్లాడుకునేది కూడా టైటిల్ గురించే.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకి అనుకుంటున్న మూడు టైటిల్స్..సి.ఈ.ఓ, సిఎం (కామన్ మ్యాన్), ఇంకోటి సిటిజెన్. ఈ మూడు టైటిల్స్ పక్కా పాన్ ఇండియన్ సినిమాకి ఉండాల్సిన మాదిరిగానే సౌండ్ వినిపిస్తోంది. అంతేకాదు, శంకర్ స్టైల్లో ఎంతో పవర్‌ఫుల్ కథ, కథనాలతో RC 15 తెరకెక్కుతుందనీ గట్టి నమ్మకం కలుగుతోంది. మరి ఈ మూడిటిల్లో ఏది ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో పూర్తి స్థాయి సినిమా చేయలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి RC 15లో మాత్రం గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు, అందరికీ సంబరమే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.