RC : పవన్ కళ్యాణ్ చేయాల్సింది చరణ్ ఒప్పుకున్నాడా..?

RC 15 : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలలో ఎంతో బిజీగా నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి గేమ్ ఛేంజర్ అని టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా రాజకీయాలు ఎలక్షన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సందర్భంగా ఈ సినిమా కథ దిల్ రాజు గారి వద్దకు వచ్చినప్పుడు శంకర్ గారు ఈ సినిమాకి చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించినట్లు తెలియజేశారు. అయితే కథ మొత్తం విన్న తర్వాత దిల్ రాజు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ సరిపోరని చరణ్ అయితే అద్భుతంగా ఉంటుందని సలహా ఇచ్చారట.

RC 15 :

ఇలా దిల్ రాజు సలహా ఇవ్వడంతో రామ్ చరణ్ ని కలిసిన శంకర్ ఆయనతో సినిమా డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ కథకు చరణ్ సరైనోడు అని భావించి ఈ సినిమాని రాంచరణ్ తో చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి పవన్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ ఒకవేళ ఇదే సినిమా కనుక పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ప్రపంచ స్థాయిలో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించేది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఈ సినిమా కూడా రాజకీయాల నేపథ్యంలో రావడంతో ఈ సినిమాకి పవన్ అయితే అద్భుతంగా ఉండేదని అభిమానుల అభిప్రాయం.

Sravani

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

7 days ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

2 weeks ago

This website uses cookies.