Raveena-Tandon : సోషల్ మీడియా రోజులు ఇవి. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పే కాలం అనే చెప్పాలి. ఒకప్పుడు అలనాటి నటీమణులు సినిమా ఇండస్ట్రీ లో ఎం జరిగినా ఎక్కడా రెవీల్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ లో చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియా పుణ్యమా ఇట్టే తెలిసిపోతోంది. ఇండస్ట్రీ లో ప్రధానంగా ఎదురయ్యే బాడీ షేమింగ్ అయినా , క్యాస్టింగ్ కౌచ్ గురించి అయినా నేటి తరం హీరోయిన్ లు సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయాన్ని వైరల్ చేస్తున్నారు. తనేం తక్కువేం కాదని అలనాటి బాలీవుడ్ తార అప్పట్లో తాను ఇండస్ట్రీ లో పేస్ చేసిన సమస్యలను చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో పంచుకుంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సినీ పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభంలో ఆమె ఎదుర్కొన్న బాడీ షేమ్ గురించి మాట్లాడారు.
90వ దశకంలో తన అందాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది రవీనా . అప్పట్లో ఆమె ఐకానిక్ నంబర్ “టిప్ టిప్ బర్సా పానీ”ని సాంగ్ ను ప్రస్తుత తరానికి చెందిన ప్రముఖ నటి కత్రినా కైఫ్ రీమేక్ చేసి ఆ పాటకు రవీనాకు ఉన్న క్రేజ్ ను మరోసారి గుర్తుచేసింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లోనూ ఆక్టివ్ గా ఉంటోంది. ఓ ఇంటర్వ్యూ లో రవీనా, ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ నుంచి కెరీర్‌ను నాశనం చేసే విషపూరిత గాసిప్ మ్యాగజైన్‌ల వరకు అనేక సమస్యల గురించి మాట్లాడింది.
అప్పటి గాసిప్ మ్యాగజైన్‌ల గురించి అడిగినప్పుడు, రవీనా చాలా నిస్సందేహంగా ఇలా చెప్పింది, 90లలో గాసిప్ మ్యాగజైన్‌లు చాలా చెత్తగా ఉండేవి అని వారు స్త్రీలకు అత్యంత శత్రువులు అని పేర్కొంది. బాడీ-షేమ్ చేస్తూ స్త్రీలను క్రిందికి తీసుకురావడానికి సాధ్యమైనదంతా వారు చేస్తారు అని పేర్కొంది. కానీ ఇప్పుడు వారు అతిపెద్ద స్త్రీవాదులుగా తిరుగుతున్నారు అని ,అది తనని అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపింది. రవీనా తన ఫ్యాట్ థైస్ గురించి పరిశ్రమలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి నిర్మొహమాటంగా పంచుకుంది. తాను కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉండేదాన్నని, తన థైస్ క్లియర్ గా కనిపించేవని, వాటిని చూసి ఇండస్ట్రీ లో నాకు పేరు పెట్టారని ఆమె తెలిపింది.
నా థైస్ ఇప్పటికి అలానే ఉన్నాయని దానివల్ల నేనేమి బాధపడేదానిని కాదని, కానీ వాటిని బేస్ చేసుకుని వచ్చే కథనాలు బాధించేవాని తన ఆవేదనని పంచుకుంది. నేనే కాదు ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు ఈ ప్రాబ్లమ్ ను ఎదుర్కొన్నారంది . ఆడవారికి మద్దతు ఇవ్వడానికి బదులుగా, అప్పటి మహిళా సంపాదకులందరూ హీరోలతో ప్రేమలో పడిపోయేవారని , హీరోలు చెప్పేది వినేవారని చెప్పింది. రవీనా చివరిసారిగా కేజీఎఫ్ చాప్టర్ 2లో కనిపించింది. ఆమె త్వరలో రిలీజ్ కానున్న సంజయ్ దత్ ఘుడచాడిని ప్రాజెక్ట్‌లలో చేసింది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్, అరణ్యక్ రెండవ సీజన్‌తో తిరిగి రానుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.