Rashmika Mandanna: పాన్ ఇండియన్ హీరోయిన్ రష్మిక మందన్నకి ఇప్పుడు అంతటా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు హిందీ, ఇటు తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ ఉండటంతో హైదరాబాద్ టు ముబై వయా చెన్నై అంటూ ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేస్తుంది. తెలుగులో రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలో మొదలవబోతుంది.
హిందీలో సందీప్ రెడ్డీ వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాను చేస్తుంది. రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా కంటే డబుల్ డోస్ ఇందులో ఉంటుందట. ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, రష్మిక స్కిన్ షో ఈ సినిమాకి హైలెట్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
అంతేకాదు, రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్నల కిస్సింగ్ పోస్టర్ కూడా వైరల్ అయింది. ప్రస్తుతం మూడు భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి హాజరైంది. అయితే, రష్మిక మందన్నకి ఎయిర్ పోర్ట్‌లో ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఓ సెల్ఫీ దిగడానికి అభిమానులు ఆరాటపడుతుంటారు.
కానీ, ఓ అమ్మాయి మాత్రం రష్మిక మందన్నని చూడగానే సడన్‌గా వెళ్ళి చేయి పట్టుకుంది. అలా చేయి పట్టుకుందెవరో చూసేలోపే ఆ అమ్మాయి రష్మిక బుగ్గపైన గిల్లి ముద్దు పెట్టింది. కొన్ని క్షణాలలో జరిగిన ఈ సంఘటన రష్మికకి షాకిచ్చింది. కాస్త తేరుకొని ఆనందంలో మునిగితేలిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.