Rashmika Mandanna : నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న లండన్ ఫ్లైటెక్కిందట. ఈ బ్యూటీ జోరు కాస్త తగ్గినా చేతిలో ఉంది మాత్రం భారీ చిత్రాలే. పుష్ప తర్వాత పాన్ ఇండియన్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తెలుగు కంటే ఎక్కువగా హిందీలో బిజీ అయింది. అలా అని తెలుగులో సినిమాలు ఒప్పుకోవడం లేదా..? అంటే అదేమీలేదు. సీతారామం లాంటి అద్భుతమైన కథ వస్తే గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీ అంటోంది.
ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ఉంది. అలాగే, బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే కల్ట్ కంటెంట్ ఉన్న సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. ఇన్ని రోజులు అటు యానిమల్ ఇటు పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటూ ముంబై టు హైదరాబాద్ ట్రావెల్ చేసింది. అయితే, యానిమల్ చిత్రీకరణ ఇక్కడ కంప్లీట్ అయిందట.
Rashmika Mandanna : రేస్‌లో కాస్త వెనకబడిన రష్మిక..
నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఏప్రిల్ నెలలో చిత్ర యూనిట్ లండన్ వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. యూకే, స్కాట్లాండ్ ప్రాంతాలలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. దాదాపు 25 రోజుల పాటు అక్కడ షూట్ చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో రష్మిక మందన్న కూడా జాయిన్ కాబోతోంది. హీరోతో కలిసి కొన్ని ఇంటిమేట్ సీన్స్ చేయనుందట. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే హీరోహీరోయిన్‌ల మధ్య ఘాటు రొమాన్స్ ఉంటుంది.
ఇందులో కూడా అలాంటి సన్నివేశాలు బాగానే ఉన్నాయట. ఇక ఇదే షెడ్యూల్‌లో బాబి డియోల్, అనీల్ కపూర్ కూడా జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకూ మళ్ళీ రష్మిక మందన్న ఇండియాకి తిరిగి రాదని తెలుస్తోంది. ఆ తర్వాత పుష్ప 2లో జాయిన్ అవుతుందట. రేస్‌లో కాస్త వెనకబడిన రష్మిక మందన్నకి హిందీలో యానిమల్ తెలుగులో పుష్ప 2 సక్సెస్ చాలా అవసరం. లేదంటే కెరీర్‌కి ఇబ్బందులు తప్పవంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.