Rangamarthanda : ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు రంగమార్తాండ సినిమాదే. ఉగాది సందర్భంగా ఈ నెల 22న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆలస్యం అయింది. ఎట్టకేలకి ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే సినిమాను చూసిన పలువురు సినీ దర్శకులు చాలా కాలానికి ఓ గొప్ప సినిమాను చూసిన అనుభూతి కలిగిందంటూ చిత్ర దర్శకుడు కృష్ణవంశీని, ఇందులో నటించిన ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహానందం ని ప్రశంసించారు.
చాలా ఏళ్ళకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా-కృష్ణవంశీ కాంబో రిపీట్ అవుతోంది. అంతఃపురం సినిమాలో ఎంత అద్భుతమైన సంగీతం అందించారో అంతకు మించిన సంగీతం ఈ సినిమాకి అందించారు రాజాగారు. సినిమా చూసిన వారు ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఒరిజినల్ సినిమా నట సామ్రాట్ కంటే రెండింతలు అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. ఇక అందరూ మరీ మరీ చెప్పుకుంటుందీ ఎన్నో ఏళ్ళ తర్వాత భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ నటించడం..ఆ పాత్రను అద్భుతంగా పండించడం గురించే.
Rangamarthanda : రమ్య ఎక్స్‌ట్రార్డనరీగా’ చేశారు.
ఇప్పటికే, పలు ఇంటర్వ్యూలలో కృష్ణవంశీ ‘రమ్య ఎక్స్‌ట్రార్డనరీగా’ చేశారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు అని. అది సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు చెబుతారు. ఇక ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీ పడి నటించారు. ఈసారి ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌కి ఖచ్చితంగా వీరిద్దరి పేర్లు నమోదవడం ఖాయం అంటున్నారు. గులాబి సినిమాలో పాట చూసి నాగార్జున కృష్ణవంశీకి నిన్నే పెళ్ళాడతా సినిమా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను స్మాల్ స్క్రీన్ మీద వస్తే చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అలాంటి సినిమాలు ఈ దర్శకుడు నుంచి ఎన్నో వచ్చాయి. సముద్రం, అంతపురం, ఖడ్గం, మురారి, రాఖీ, పైసా, నక్షత్రం, చక్రం, మహాత్మ, గోవిందుడు అందరివాడు..ఇలా ప్రతీ సినిమా ఓ గొప్ప అనుభవం. ఓ సినిమా ఫ్లాప్ అయిందీ అంటే మళ్ళీ అది స్మాల్ స్క్రీన్ మీద వచ్చినా పట్టించుకోరు. కానీ, కృష్ణవంశీ రూపొందించిన ఫ్లాప్ సినిమాకి విపరీతమైన ఆదరణ ఉంటుంది. దీనికి కారణం ఒక్క షాట్ విషయంలో కూడా ఆయన కాంప్రమైజ్ కాకపోవడమే. అనుకున్నది సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేంతవరకూ తాపత్రయపడుతూనే ఉంటారు కృష్ణవంశీ.
అలాంటి గొప్ప క్రియేటర్ నుంచి చిన్న గ్యా తర్వాత వస్తున్న అద్భుతమైన దృశ్యకావ్యం లాంటి సినిమానే రంగమార్తాండ. రాయి లాంటి గుండె ఉన్నవారైనా ఈ సినిమాలో సన్నివేశాలు చూస్తున్నప్పుడు కరిగి కన్నీటి రూపంలో బయటకి రావాల్సిందే. ఇలాంటి సినిమాను చూడని వారు సినిమాపై ప్రేమ లేని వారనే చెప్పొచ్చు. అంత అద్భుతంగా వచ్చింది రంగమార్తాండ. నిజమైన జీవితాలు మరికొన్ని రోజుల్లో వెండితెరపై కనిపించబోతున్నాయి. ఈ సినిమా సక్సెస్ తర్వాత కృష్ణవంశీ గురించి మాట్లాడని వారుండరు. ఇందులో డౌటే లేదు. ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు అందరి టెక్నీషియన్స్ కెరీర్‌లో ఓ గొప్ప సినిమాగా నిలబడుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.