Ramya Krishna : చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియా ముందు వెల్లడిస్తూనే ఉన్నారు. కొంతమంది తారలు సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ లు పెడుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా మంచి నటీమణులు తమ అభిప్రాయాలను తెలిపారు. స్టార్ హీరోయిన్స్ నుంచి అప్‌కమింగ్ ఆర్టిస్టులు, సింగర్స్ వరకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మహిళలు లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే చెప్పారు. లేటెస్టుగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ , సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
1990ల్లో తెలుగు ఇండస్ట్రీని ఏలారు రమ్యకృష్ణ. తన నటన, అందం,డ్యాన్స్ తో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరీతో జోడీ కట్టారు రమ్య. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకున్న క్రేజ్ వేరే లెవెల్. తెలుగులోనే కాదు తమిళంలోనూ చాలా సినిమాలు చేశారు.రమ్యకృష్ణ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, నంది అవార్డులను అందుకున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో తన నటనతో మెప్పించారు. ఇప్పుడు రమ్యకృష్ణ కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్ చేశారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” కాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంది. కానీ సెలబ్రిటీలే ఎక్కువగా ఈ విషయంలో తెరపైకి రావడంతో అందరూ ఈ ఇండస్ట్రీ గురించే ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారు. కొంతమంది ఇదే ఛాన్స్ గా భావించి దాన్ని ప్రచారం చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఫిల్మ్ ఇండ్ట్రీలో స్టార్‌గా రాణించాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సిందే”అని అన్నారు రమ్యకృష్ణ. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో రమ్యకృష్ణను కొంత మంది ట్రోల్ చేస్తున్నారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.