Ramajogaiahsastry: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ కి కాపీ క్యాట్ అనే పేరున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ట్యూన్స్ కాపీ కొడతారనే మాట వినిపిస్తూనే ఉంది. ప్రతీ సినిమాలో ఏదో ఒక పాట విషయంలో సోషల్ మీడియా సాక్షిగా చాలా రాద్ధాంతం జరుగుతోంది. అయినా, థమన్ వీటిని పట్టించుకోవడం లేదు. దీనికి కారణం మన స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఆయనని ఎంకరేజ్ చేస్తూ వరుసగా సినిమాలిస్తున్నారు కాబట్టి.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతుంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా హారిక అండ్ హాసిని పతాకంపై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే, సంక్రాంతి రేసులో ఈ సినిమాను తీసుకురావాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా ఓవైపున సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండవ పాటగా ‘ఓ మై బేబీ’ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటకి ‘సరస్వతీపుత్ర’ రాంజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శిల్పారావు పాడారు. అయితే, ఈ పాట ‘అలవైకుంఠపురములో’ సినిమాలో ట్యూన్ మాదిరిగా ఉందంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో దీనికి గురించి తెగ చర్చ సాగుతోంది. కొందరు తిడుతూ కామెంట్స్ చేశారు.
ఈ ట్రోల్స్‌పై లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి స్పందించారు. ‘ప్రతివాడు మాట్లాడేవాడే.. రాయి విసిరేవాడే. అభిప్రాయం చెప్పే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని. మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా. అదే లేకపోతే.. ప్రేమించకపోతే మా పని మేము గొప్పగా చేయలేం. తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి’.. అంటూ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కానీ, ఇంకా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ స్పందించకపోవడం ఆశ్చర్యకరం.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.