Ram Gopal Varma : ఎవరు ఊహించిన సినిమాలను తీస్తూ..హీరోయిన్లను సరికొత్తగా చూపిస్తూ.. దర్శకత్వంలోనూ వైవిధ్యాన్ని చూపించే ఏకైక టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. శివ, సత్య, సత్య 2, రక్త చరిత్ర వంటి ఎన్నో కంట్రోవర్సీ సినిమాలను తియ్యగాలిగే సత్తా అర్జీవికి మాత్రమే ఉంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు లో బొల్డ్ సినిమాలు తియ్యడం కేవలం ఈయనకు మాత్రమే సాధ్యం.
సినిమాలు తీయడంలోనే కాదు మాట్లాడే ప్రతి మాట ఇండస్ట్రీలో సునామిని సృష్టిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలు, పాలిటిక్స్ గురించి సోషల్ మీడియా వేదికగా తనకు తోచింది మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ట్విట్టర్ వేదికగా హాట్ హాట్ ట్వీట్లు పెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి ఆర్జీవి హాట్ టాపిక్ అయ్యాడు.
ఒకరకంగా చెప్పాలంటే ఆర్జీవి ఎంతోమంది యాంకర్లకు లైఫ్ ఇచ్చాడు. బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి అందరి మైండ్ బ్లాక్ చేశాడు. ముఖ్యంగా ఆడవాళ్ళ అందాలను పోగడటంలో ముందు వరుసలో ఉంటాడు. సోషల్ మీడియా స్టార్స్ అయిన ఆషు రెడ్డి, అరియనా గ్లోరీ అందాలను పొగిడి వాళ్లని సెలబ్రిటీలు గా మార్చాడు. ఈ దెబ్బతో అరియాన రేంజ్ మారిపోయింది. టెలివిజన్లో బిగ్గెస్ట్ షో అయిన బిగ్ బాస్ షోలో యాంకర్ గా మారింది. దీనితో ఆమె కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇదిలా ఉంటే ఇనయా సుల్తానా తో ఆర్జీవి చేసిన డాన్స్ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య రాంగోపాల్ వర్మ కళ్ళు ఓ చీర పిల్ల మీద పడ్డాయి. ఆమెతో సినిమా చేయాలనుందని అప్పట్లో ట్విటర్ లో ఆమె ఫోటో షేర్ చేసి హల్చల్ చేశాడు.
రాంగోపాల్ వర్మ ఒక అమ్మాయి రీల్ షేర్ చేసి ఈ అమ్మాయి ఎవరో చెప్పండి అంటూ పజిల్ ఇచ్చాడు. ఈ పోస్ట్ పెట్టిన వన్ నైట్ లోనే అమ్మడు సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. ఆమె ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా అనూహ్యంగా పెరిగిపోయింది. ఆమె మళయాళం అమ్మాయి. ఆమె పేరు శ్రీలక్ష్మి సతీష్ అని వివరాలు తెలుసుకున్న వర్మ , వెంటనే ఆమెను ఫాలో చేయడం మొదలుపెట్టాడు. ఆమె విడియోలు షేర్ చేసి, ఈమెతో చీర కాన్సెప్ట్ తో సినిమా చేస్తాను అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఈ కామెంట్ నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అయింది.
అయితే ఈ మధ్య వ్యూహం సినిమాలో బిజీ గా ఉన్న వర్మ, ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. శారీ అనే సినిమా పోస్టర్ రిలీజ్ చేసి ఎవరూ ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు. చీర పిల్లలతో సినిమా తీస్తానని అన్నట్లుగానే ఆర్జీవి దానికి కార్యరూపం దాల్చాడు.ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేసాడు. ఏదైనా ఆర్జీవిలా మరో డైరెక్టర్ చేయడం అసాధ్యమే అంటున్నారు నేటిజన్స్. అనుకున్నది తప్పక చేసి తిరుతాడని పొగడ్తలతో ముంచేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.