ram-charan-movie-shooting-in-ap
RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఏపీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అది కూడా అభ్యుదయ పార్టీ తరుపున తన పార్టీ అభ్యర్ధులని ఖరారు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మాట వింటే మెగా అభిమానులకి కొంత క్లారిటీ వచ్చిన మిగిలిన వారు షాక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది నిజానికి జరుగుతుంది రియల్ గా కాదు. రీల్ కోసం మాత్రమే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని ప్రస్తుతం దర్శకుడు శంకర్ చిత్రీకరిస్తున్నారు.
ఈ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ అప్పన్న అనే రాజకీయ నాయకుడుగా కనిపించబోతున్నాడు. అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగిస్తున్న నాయకుడిగా అతని పాత్ర ఉండబోతుంది. ఇక అభ్యుదయ పార్టీ అధినేతగా అన్ని నియోజకవర్గాలలో తన ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటిస్తూ, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్న సన్నివేశాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు.
అలాగే కర్నూల్ లో షూటింగ్ జరిగింది. ఇప్పుడు విశాఖలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబందించిన సన్నివేశాలు కంప్లీట్ అవుతాయని తెలుస్స్తుంది. ఇక ఈ మూవీలో మరో పాత్రలో రామ్ చరణ్ జిల్లా కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. రామ్ నందన్ ఐఏఎస్ గా అతని పాత్ర ఉండబోతుంది. ఇక తండ్రిలా రాజకీయ నాయకుడు కాకుండా ప్రభుత్వ అధికారిగా రాజ్యాంగేతర శక్తులతో పోరాడే పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.