Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత నాలుగేళ్ళుగా అటు ఆర్ఆర్ఆర్ ఇటు ఆచార్య సినిమాల కోసం రెండు రకాల లుక్స్ మేయిన్‌టైన్ చేస్తూ వచ్చారు మెగా పవర్ స్టార్. ఇటీవల నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ కూడా అందుకున్న విషయం తెలిసిందే. అయితే, క్రియేటివ్ జీనియస్ శంకర్, చరణ్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు.
కియారా అద్వానీ హీరోయిన్‌గా.. అంజలి, శ్రీకాంత్, రాహుల్ రవీంద్రన్, జయరాం లాంటి పాపులర్ స్టార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దిల్ రాజు-శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకీ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే, గతంలో ఆర్సీ 15 నుంచి చరణ్ లుక్ ఒకటి లీకై నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ లుక్ చూసిన అందరూ ఏజ్ ఎక్కువ కలిగిన పాత్రలో కనిపించబోతున్నారని చెప్పుకున్నారు.
ఇప్పుడేమో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చారు రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇటీవల రంగమార్తాండ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించి ప్రశంసలు అందుకుంటున్న సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మానందని సత్కరించారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చరణ్ సైడ్ క్రాఫ్ చేయించుకొని ఆర్మీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి గెటప్‌లో చరణ్ కనిపించలేదు.
దాంతో మెగా అభిమానులు, ప్రేక్షకులు చరణ్ లుక్ చూసి షాకవుతున్నారు. ఖచ్చితంగా శంకర్ సినిమాలో చరణ్ పోషించే పాత్ర హైలెట్ కావడం పక్కా అని చెప్పుకుంటున్నారు. ఏకంగా మెగా అభిమానులైతే చరణ్ న్యూక్‌ను తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసుకుంటూ బాగా వైరల్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ మూవీకి సీఈవో అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.