Rajamouli: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి. తాజాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. ఇకపోతే ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరూ చేయని ప్రయత్నం రాజమౌళి చేశారు.
భారీ మార్కెట్ ఉన్న బాలీవుడ్ వాళ్ళు కూడా ఎలాంటి అటెంప్ట్ చేయలేదు. మొదట 90 కోట్లతో అనుకున్న బాహుబలి చిత్రం రెండు పార్ట్స్ కోసం 250 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. 2015 జూలైలో బాహుబలి మొదటి భాగం విడుదలయింది. అప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, ఆ సినిమాపై ఉన్న క్రేజ్ తో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా అంటూ నార్త్ లో కూడా ప్రమోషన్స్ చేశారు. భారీ అంచనాలతో సినిమా రిలీజ్ అయింది. నార్త్ లో సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దారుణమైన టాక్. ఒక వండర్ ని చూడడానికి వెళుతున్నాం అని భావించిన ఆడియన్స్ పూర్తిగా సంతృప్తి చెందలేదు.
సెకండ్ హాఫ్ చివరి 40 నిమిషాలు అద్భుతం. కానీ ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంటుంది. దీనితో ఆడియన్స్ అనుకున్న స్థాయిలో సినిమా లేదంటూ ప్రచారం చేశారు. ఆ ప్రచారం నెమ్మదిగా ఎక్కువై డిజాస్టర్ అనే రేంజ్ కి కూడా నెగిటివ్ టాక్ వెళ్ళింది. తన జీవితంలో బాగా డిప్రెషన్ కి గురైన సందర్భం అదే అని దర్శకధీరుడు రాజమౌళి తెలిపారు. ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా బాహుబలి 1 ని రిలీజ్ చేశాము. అంతా మంచి స్పందన వస్తోంది. కానీ మాకు ప్రధానమైన తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ టాక్ వచ్చింది. నా నిర్మాతలు వందల కోట్ల డబ్బు వెచ్చించారు. అంతా ఏమవుతుందో అర్థం కాలేదు. డిప్రెషన్ లోకి వెళ్ళా అని రాజమౌళి తెలిపారు. నిజంగానే బాహుబలి 1 డిజాస్టర్ అయితే ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని రాజమౌళి అన్నారు. కానీ రాజమౌళి విజన్ ముందు నెగిటివ్ టాక్ పనిచేయలేదు. బాహుబలి చిత్రాన్ని ఒక్కసారైనా చూడాలని ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడ్డారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్ బాగా వర్కౌట్ అయింది. అది మొదటి భాగానికి కూడా వర్కౌట్ అయింది. అలాగే సెకండ్ పార్ట్ పబ్లిసిటీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. కొన్ని రోజుల తర్వాత నెగిటివ్ టాక్ మొత్తం తుడిచిపెట్టుకునిపోయి బాహుబలి 1 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది అని తెలిపారు రాజమౌళి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.