Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు జక్కన్న. తన సినీ కెరీర్ లో ఎన్నో వండర్ ఫుల్ సినిమాలు చేసి తెలుగు ఇండస్ట్రీని తారాస్థాయికి చేర్చారు. ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి పేరు మారుమోగింది. తెలుగు సినిమాకు ఆస్కార్ ను తెచ్చి పెట్టిన ఘనుడు రాజమౌళి. ఆయన సినిమాల గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. అదో తపస్సులాగా ప్రతి సినిమాను ఎంతో ప్లాన్డ్ గా తీస్తారు రాజమౌళి. ఆయన తీసే సినిమాల్లాగే ఆయన లైఫ్ లోనూ ఎన్నో సినిమాటిక్ మూమెంట్స్ ఉన్నాయి. సినిమా లెవెల్ లో రాజమౌళి ప్రేమించి మరీ రమను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే తాజాగా వీరి లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి బెటర్ హాఫ్ రమా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి విజయం వెనుక రమా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె జస్ట్ బెటర్ హాఫ్ మాత్రమే కాదు. ప్రతి సినిమాలో రమా పాత్ర కూడా అత్యంత కీలకంగా ఉంటుంది. ఆమె తన కెరీర్ ను ఓ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా స్టార్ట్ చేశారు. అలా అంచెలంచెలు ఎదుగుతూ ప్రొడక్షన్ పనులు చూసే వరకు వచ్చాయి. ఇక సినిమా మేకింగ్ విషయంలో రమా రాజమౌళికి ఎంతో సపోర్ట్ గా ఉంటారు. అయితే రమాకు రాజమౌళితో పెళ్లి కంటే ముందే మరో వ్యక్తితో వివాహం జరిగింది. కార్తికేయ కూడా రాజమౌళి కొడుకు కాదు. అయితే కొన్ని కారణాల వల్ల రమా తన మొదటి భర్తతో విడిపోయారు. ఈ క్రమంలో రమా చెల్లి వల్లి ని కీరవాణి పెళ్లి చేసుకున్నారు. కీరవాణికి రాజమౌళి తమ్ముడు కావడంతో రమాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చాలా కాలం కేవలం మాటలు మాత్రమే ఉండేవి. కానీ స్టూడెంట్ నెం.1 సినిమా టైంలోనే వీరి ప్రేమ చిగురించింది.” మాది పెద్ద లవ్ స్టోరీ కాదు. మా ఇద్దరి ఆలోచనలు 99 శాతం ఒక్కటే. సినిమాల విషయంలోనే ఆ ఒక్క శాతం తేడా ఉంటుంది. మిగతాదంతా సేమ్ టు సేమ” అని రమా రాజమౌళి తెలిపారు.
రమా, రాజమౌళి మధ్య ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. రాజమౌళితో పెళ్లికి ముందే రమకు ఓ కొడుకు ఉన్నాడు. అయినా రాజమౌళి మళ్లీ పిల్లల కావాలని కోరుకోలేదు. కార్తికేయను స్వీకరించాడు. అంతే కాదు మయూఖ అనే పాపను దత్తత తీసుకున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి కపుల్స్ ను చాలా అరుదుగా చూస్తాం. రమాకి రెండో పెళ్లి అయినా, కొడుకు ఉన్నా కూడా రాజమౌళి యాక్సెప్ట్ చేసిన తీరు నిజమైన ప్రేమకి సాక్ష్యం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రాజమౌళి తన పనిలో ఇంత సక్సెస్ ను సాధిస్తున్నారు. ప్రతి వ్యక్తి అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ రావాలనుకుంటారు. ప్రతి విషయంలో తమకు తోడు ఉంటే లైఫ్ లో ఎన్నోవిజయాలను సొంతం చేసుకోవచ్చు అనేందుకు రాజమౌళి కపుల్స్ ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.