Pushpa2-Jagdish : పుష్ప ఒక సినిమా కాదు ఇది ఒక బ్రాండ్. ఈ టాలీవుడ్ మాస్ మూవీ ఇండియా వైడ్ గా దుమ్ము దులిపేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్ సుకుమార్ డైరెక్షన్ పుష్ప బ్లాక్ బస్టర్ హిట్టుకు ప్రధాన కారణాలని చెప్పక తప్పదు. వీరే కాదు ఈ మూవీలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ తమ పాత్రకు ప్రాణం పోశారు. ఇందులో మరీ ముఖ్యంగా పుష్పకు తోడుగా ఉంటూ తన కామిక్ సెన్స్ తో అందరినీ అలరించాడు ఆర్టిస్ట్ జగదీష్. పుష్పలో తన కేశవ నటనను మెచ్చిన డైరెక్టర్ పుష్ప 2 లోనూ జగదీష్ ని తీసుకున్నాడు. అయితే తాజాగా జగదీష్ అరెస్ట్ కావడంతో టాలీవుడ్ లో ఇది ఒక సెన్సేషనల్ టాక్ గా మారింది. దీంతో పుష్ప సీక్వెల్ షూటింగ్ కు కేశవ కారణంగా బ్రేక్ పడిందని నెట్టింట్లో వార్తలు తెగచక్కర్లు కొడుతున్నాయి. దీనితో మూవీపై రకరకాల రూమర్స్ రోజుకు ఒకటి పుట్టుకువస్తున్నాయి.
జగదీష్ ఇండస్ట్రీ లో జూనియర్ ఆర్టిస్ట్ మరణాని కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీసులు జగదీశ్‌ను అరెస్ట్ చేశారు. 14రోజులు రిమాండ్‌కు పంపించారు. కేశవ అరెస్టుతో మూవీ మేకర్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే పుష్ప-2లో జగదీశ్ పాత్ర కీలకంగా ఉండబోతుందని టాక్ . అయితే ఇప్పటివరకు కేశవ క్యారెక్టర్ కి సంబంధించిన షూట్ పూర్తి కాలేదట. ఈలోపే కేశవ అరెస్టు కావడంతో అంత ఆలోచనలో పడిపోయారు. అందుకే మేకర్స్ జగదీష్ డూప్ తో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు డూప్‌తో కొన్ని సీన్లు కూడా షూట్ చేశారట.కానీ అది వర్కౌట్ కాలేదని టాక్ వినిపిస్తోంది.
ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో ఫార్ములా ఉంటుంది. అది వర్క్ అవుట్ కాకపోతే అసలు ఊరుకోరు కొంతమంది డైరెక్టర్లు. ఇక డైరెక్టర్ సుకుమార్ అయితే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు.మూవీ ప్రొడ్యూసర్స్ మ్రైతీ మూవీ మేకర్స్ కూడా అంతే. అందుకే జగదీష్ ను ఎలాగైనా బేల్ మీద బయటకు తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 టీమ్ షూట్‌ను సజావుగా కంప్లీట్ అయ్యేలా జగదీశ్ ను బయటకు తీసుకురావడంపై పూర్తి దృష్టి పెట్టిందట. ఏది ఏమైనా టాలీవుడ్ హిస్టరీ లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ఫస్ట్ టైమ్. పుష్పలో హీరోతో సమానంగా కేశవ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంది. సెకండ్ పార్ట్ లోనూ అదే ఉండనుందని సమాచారం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.