Pushpa 2: The Rule Review; “వెయ్యి కోట్లు తగ్గేలే”..”తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే”..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ, సినీ ఇండస్ట్రీలో గానీ ‘పుష్ప 2’ మూవీ గురించి వినిపిస్తున్న కొత్త డైలాగ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్-రష్మిక మందన్న కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప ది రైజ్’ కి కొనసాగింపు ‘పుష్ప 2: ది రూల్’. భారీ అంచనాలతో మెగా ఫ్యాన్స్ చేసిన నెగిటివ్ పబ్లిసిటీతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డిసెంబర్ 5వ తేదీ(గురువారం) ప్రపచవ్యాప్తంగా అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ అయిన ‘పుష్ప 2’ కొన్ని గంటల ముందే అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటలకి కొన్ని ప్రాంతాలలో బెనిఫిట్ షోస్ ప్రదర్శించారు. ఇదేమీ కొత్త కాదు..పెద్ద స్టార్ నటించిన సినిమాకి బెనిఫిట్ షోస్ వేయడం పాతపద్ధతే. కానీ, టికెట్ రేట్లే ‘ఒకసారి గుండె ఎటువైపుందో’ చెక్ చేసుకునేలా మేకర్స్ ఫిక్స్ చేశారు.
అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘తగ్గేదే లే’ అన్నారు. వాస్తవానికి మన సౌత్ ఇండస్ట్రీలలో సీక్వెల్ అంతగా సక్సెస్ అయింది లేదు. ఒక్క ‘బాహుబలి 2’ తప్ప. అలాంటిది ‘పుష్ప 2’ మీద మాత్రం భారీగానే అంచనాలు పెరిగాయి. ఒకరకంగా పెంచారు అని చెప్పాలి. అంతకముందు వరకు అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ఒకెత్తైతే ‘పుష్ప’ తర్వాత వచ్చిన క్రేజ్ ‘అన్‌స్టాపబుల్’ అని చెప్పాలి. ముఖ్యంగా ‘పుష్ప’ సీక్వెల్ కి ఇంత బజ్, క్రేజ్ తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం మెగా హీరోలది, మెగా ఫ్యాన్స్ ది అని చెప్పాల్సిందే.
వాళ్ళు ఈ మూవీ మీద, అల్లు అర్జున్ మీద చేసిన నెగిటివ్ పబ్లిసిటీ జనాలలోనూ అల్లు అభిమానులలోనూ విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. దీన్నే మైత్రీ మూవీ మేకర్స్ క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా బెనిఫిట్ షోలకి 1000 రూపాయల పైనే రేట్ ఫిక్స్ చేశారు. దీనిపై ఎలాంటి కామెంట్స్ వచ్చినా అనుకున్న సమయానికి కాస్త అటు ఇటుగా థియేటర్స్ లో బొమ్మ పడింది.
‘పుష్ప 2’ ఎలా ఉంటుందో..ఫ్లాపా, డిజాస్టరా..యావరేజా, ఇండస్ట్రీ హిట్టా..1000 కోట్ట్లు కొల్లగొడుతుందా..? అన్న కామెంట్స్ కి కొంత వరకూ సమాధానం దొరికినట్టే. 4వ తేదీ రాత్రి 9:30 షో తర్వాత సినిమా హిట్ అని గట్టిగా వినిపించింది. ‘మెగా ఫ్యాన్స్ అని చెప్పుకునే కొందరు యాంటీ ఫ్యాన్స్’ ట్రోల్స్ ఏవీ పనిచేయలేదు. ఇంట్రో సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకూ సుకుమార్ ఆడియన్స్ బాగా ఎంగేజ్ చేశాడు. ఐకాన్ స్టార్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ కి అందరూ చప్పట్లు కొట్టి ఈలలేశారు.
ముందునుంచీ చెప్పుకుంటున్నట్టుగా జాతర సీన్స్, సాంగ్స్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్ళాయి. రిలీజ్ కి 15 రోజుల ముందునుంచి మెకర్స్ ఉపయోగించిన స్ట్రాటజీ, సుకుమార్-బన్నీ-దేవీశ్రీప్రసాద్ అలాగే నిర్మాతల ఎమోషన్స్ (కన్నీళ్ళు పెట్టుకోవడం) బాగా వర్కౌట్ అయ్యాయి. నార్త్ లో పుష్ప 2 ప్రభంజనం కనిపిస్తోంది. పార్ట్ 1 కి మాదిరిగానే పార్ట్ 2 కూడా మన తెలుగు కంటే మిగతా భాషలలో సక్సెస్ రేట్, కలెక్షన్స్ ఊహించరు.
సినిమాకి కొందరు ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూస్ ఇస్తుంటే కొందరు మిక్స్డ్ రివ్యూస్ ఇంకొందరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. కథ లేకపోయినా కూడా సుకుమార్ తన స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్ తో అల్లు అర్జున్ తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో పుష్ప 2 రికార్డ్స్ కి ట్రై చేస్తున్నారు. ఒకరకంగా ఈ మూవీని ఇంత గ్రాండ్ గా తీయడానికి రికార్డ్స్, అవార్డ్స్ కొట్టాలనే కసే అనుకోవచ్చు.
శ్రీలీల పాట కాస్త డిసప్పాయింట్ చేసినా రష్మిక మాత్రం తన అందాలతో ఆలోటు తీర్చేస్తుంది. అల్లు అర్జున్ వేసిన గెటప్.. జాతర సీన్స్, అదే కంటిన్యూ చేస్తూ తీసిన సాంగ్, క్లైమాక్స్ సినిమాకి హైలెట్. ఇవన్నీ వర్కౌట్ అవుతాయో లేదో అన్న పెద్ద డౌట్ ఉండే మేకర్స్ జాగ్రత్త పడి బెనిఫిట్ షోలకి టికెట్ రేట్స్ వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు. ఆ భయం అక్కర్లేదనిపిస్తోంది.
ఎందుకంటే 1000 కోట్ల మాట పక్కన పెడితే రానున్న మూడు నాలుగురోజుల్లోనే ఇటు మేకర్స్ అటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సేఫ్ అయిపోతారు. అంతవరకూ గ్యారెంటీ. ఆ తర్వాత కూడా పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే అప్పుడు అవార్డులు, వెయ్యి కోట్ల గురించి మాట్లాడుకోవచ్చు. అందరినీ పుష్ప 2 కోసం థియేటర్స్ రప్పించే సత్తా ఉంది అల్లు అర్జున్, సుకుమార్ ల కంటే కూడా వీళ్ళు కావాలని రాశారా కల్పించి రాశారా తెలీదు గానీ, “వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికీ నేనే బాస్” అనే డైలాగ్ ఒక్కటే. ఇదే పెద్ద దుమారం రేపడంతో పాటు సినిమా మైలేజ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఏదేమైనా తగ్గేదే లే.
కేవలం భార్యతో ఒక ఫొటో అడిగి అవమానించబడ్డ పుష్ప రాజ్ ఏ రేంజ్ లో రివేజ్ తీర్చుకున్నాడో సినిమా చూసినోడికి తెలుస్తుంది..బయట ఉన్న వాడికి ట్విట్టర్ చూస్తే తెలుస్తుంది. మెంటల్ మాస్ అంటూ ట్యాగ్స్ పెట్టి బన్నీ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే అల్లు వర్సెస్ మెగా అనుకుంటున్నారు గానీ, లోలోపల వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఫ్యాన్సే మెంటల్ మాస్ గాళ్ళు అనుకోవాలి. నెగిటివ్ టాక్ తో నెగిటివ్ ట్రోలింగ్ తో సినిమాని ఒక రేంజ్ తీసుకొచ్చి పెడతారు.
Sreeleela: శ్రీలీల కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తానే చిన్న బ్రేక్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కన్నడ,…
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
This website uses cookies.