Pushpa 2 : ఇండియా వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన మూవీ పుష్ప. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది. ఈ సినిమా విడుదలకు ముందే పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. శ్రీవల్లీ, నా సామి, వంటి పాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఊ అంటావా మావా ఊహు అంటావా’ అనే సాంగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. స్టౌత్ స్టార్ బ్యూటీ సమంత ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయింది. ‘పుష్ప’మూవీ విజయంలో ఈ పాట కూడా కీలకంగా నిలుస్తుంది. అప్పట్లో ఈ సాంగ్ కు ఓ రేంజ్ పాపులారిటీ వచ్చింది.
పుష్పకు వచ్చిన రెస్పాన్స్ తో అంతకు మించిన స్టోరీతో సుకుమార్ పుష్ప 2 తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన పుష్ప రాజ్ సాంగ్ ప్రోమో ఇరగదీస్తోంది. రెండు మూడు రోజుల్లో రష్మిక సాంగ్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వచ్చింది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ పాట కోసం ఇప్పటికే మేకర్స్ చాలా మంది హీరోయిన్స్ పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. యానిమల్ మూవీలో కుర్రాళ్ల మనసులను దోచేసిన తృప్తి పుష్ప2 స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
యానిమల్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ తృప్తికి దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ గా మార్చేశాడు. ఈ సినిమా హిట్ తో బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప 2 ఆఫర్ కూడా వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో త్రిప్తి , అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. పుష్ప2 లో ప్రత్యేక గీతానికి ఓ రేంజ్ క్రేజ్ ఉంది. బన్నీ, త్రిప్తి జోడిగా ఈ సాంగ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. బన్నీ సూపర్ డ్యాన్సర్.. ఇక త్రిప్తి గ్లామర్ రెండూ కలిస్తూ సాంగ్ సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. మరి వీరిద్దరి జోడీ ఫిక్స్ అయ్యిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.