Categories: LatestNewsTechnology

Technology: ఔరా డిజిటల్ ఖాతా…చిన్న వ్యాపారుల కోసం సురక్షితమైన యాప్

Technology: వ్యాపారాన్ని నడపడం అంత ఈజీ అయిన పని కాదు. భారత దేశంలో బై నౌ అండ్ పే లేటర్ విధానం రావడం వల్ల వ్యాపారాన్ని నిర్వహించడం ఆర్థిక స్థితిని సరిగ్గా ఉంచుకోవడం అనేది కఠినతరంగా మారింది. భారతీయ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అవగాహనతో, వ్యాపారులు తమ వ్యాపారాలను నిర్వహించడంలో సహాయపడే పరిష్కారాన్ని అందించించే దిశగా ప్రారంభమైన ఖాతా బుక్-డిజిటల్ ఇండియాస్ డిజిటల్ ఖాతా అనే భారతీయ స్టార్టప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2018 లో ఆశిష్ సోనోన్, ధనేష్ కుమార్, జైదీప్ పూనియా, రవీష్ నరేష్‌లు ఖాతా బుక్ స్టార్టప్‌ను స్థాపించారు. చిన్నమొత్తంలో వ్యాపారం చేసే యజమానులు వారి వ్యాపారం తో పాటు వ్యక్తిగత క్రెడిట్‌లను నిర్వహించడానికి ఈ కంపెనీ సహాయ పడుతుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 173 మిలియన్ డాలర్ల నిధులను పొందింది. ఈ డిజిటల్ లెడ్జర్ యాప్ ఆటోమేటిక్‌గా తన కస్టమర్‌లకు చెల్లింపు రిమైండర్‌లను పంపుతుంది. కస్టమర్‌లు వారి అన్ని లావాదేవీలు, చెల్లింపులను ట్రాక్ చేయడానికి వీలును కల్పిస్తుంది.

ఈ బిజినెస్ ఐడియా 2016లో నే ప్రారంభమైంది. వ్యవస్థాపకుల్లో ఒకరైన రవీష్ నరేష్ తన కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి Kyte.ai అనే డిజిటల్ స్పెండ్ మేనేజర్ యాప్‌ను ప్రారంభించాడు. వినియోగదారులు వారి SMS హెచ్చరికలను ఉపయోగించి వారి ఖర్చుల నమూనాలను అర్థం చేసుకోవడంలో యాప్ వారికి సహాయపడింది. ఆ తరువాత నిర్వహించిన పరిశోధనలో ఆన్‌లైన్ వినియోగదారులు డిజిటల్ లావాదేవీలతో వ్యవహరించడం లేదని , వారు ఇప్పటికీ సాంప్రదాయ ఖాతా లేదా లెడ్జర్ పుస్తకాలపై ఆధారపడుతున్నారని వారు కనుగొన్నారు. అప్పుడే ఖాతా బుక్ ఆలోచనకు బీజం పడింది. ఆ తరువాత ఒక సాధారణ నగదు నిర్వహణ యాప్‌లో పని చేయడం ప్రారంభించారు, దానికి ఖాతా బుక్ అని పేరు పెట్టారు. ఫోన్‌లో తమ తమ వ్యాపారం , వ్యక్తిగత లెడ్జర్‌లను నిర్వహించడంలో ఖాతా బుక్ ఎంతగానో సహాయం అందిస్తోంది.

ఈ డిజిటల్ లెడ్జర్ యాప్ సురక్షితమైనదని యాప్ డెవలపర్స్ తెలిపారు. బహుళ వ్యాపారాలలో ఎంతమంది కస్టమర్‌లకైనా క్రెడిట్-డెబిట్ వివరాలను మీ ఫోన్‌లో సిద్ధంగా సులభంగా ఉంచుకోవడానికి ఖాతా బుక్ అనుమతిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యాప్ ద్వారా వ్యాపారులను ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసుకోవడానికి వీలవుతుందని ఖాతా బుక్ వ్యవస్థాపకులు తెలిపారు. ప్రస్తుతం ఖాతా బుక్‌ను ఒక కోటికిపైగా వ్యాపారులు వినియోగిస్తున్నారు. ప్రతి నెల 5.5 మిలియన్ క్రియాశీల వినియోగదారులను ఈ యాప్ కలిగి ఉంది. ఇప్పటివరకు, ఈ డిజిటల్ లెడ్జర్ యాప్ 5 లక్షల కోట్లలకు పైగా లావాదేవీలను నమోదు చేసింది. 10,000 లకు పైగా నగరాలు ,పట్టణాలలో ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

కిరానా షాప్ ఓనర్‌లు, చిన్న వ్యాపారులు, రీఛార్జ్ షాప్ ఓనర్‌లు మొదలైనవారు ఈ యాప్ యూజర్లుగా ఉన్నారు. ఖాతా బుక్ మల్టీ లాంగ్వేజస్‌లో అందుబాటులో ఉంది. హిందీ, పంజాబీ , కన్నడ, తమిళం, ఇంగ్లీష్ ఇలా 10కిపైగా భాషలలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఈ ఖాతాబుక్ రాబోయే నెలల్లో MSME ల కోసం ఇతర ఉత్పత్తులను ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. అంతే కాదు కంపెనీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీలతో కలిసి పని చేయాలని యోచిస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.