Tollywood: ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా తక్కువ బడ్జెట్ సినిమాలతోనే నిర్మాతలకు ఎక్కువ శాతం లాభాలుంటాయని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. అంతేకాదు, నిర్మాతకు పెద్దగా టెన్షన్ ఉండదు..భారీగా ఫైనాన్స్ తెచ్చి వడ్డీలు ఎక్కువగా కట్టాలనే భయం ఉండదు. కథ, కథనం బావుంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. మంచి శాటిలైట్ ఆఫర్, ఓటీటీ ఆఫర్ అలాగే, రీమేక్ అండ్ డబ్బింగ్ రైట్స్ రూపంలోనూ చిన్న సినిమాను నిర్మించిన నిర్మాతకు అధికంగా లాభాలు వస్తుంటాయి.
అలా మన టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి మంచి లాభాలు సొంతం చేసుకున్న చిత్రాలు కొన్నిటిని చూద్దాం.
పెళ్లి చూపులు: యంగ్ టాలెంట్ కలిసి తీసిన సినిమా ఇది. ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమాలో చిన్న పాత్ర చేసిన విజయ్ దేవరకొండ, షార్ట్ ఫిలింస్‌లో చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి రీతూవర్మ జంటగా నటించారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. పెళ్లి చూపులు నేపథ్యంగా ఈ సినిమా కథ, కథనం సాగుతాయి. అలాగే, హీరో – హీరోయిన్‌లకు జీవిత లక్ష్యం ఉంటుంది. హీరో మంచి చెఫ్‌గా పేరు తెచ్చుకోవాలను కుంటే హీరోయిన్ వ్యాపారం చేసి పెద్ద స్థాయికి రావాలని ఆరాటపడుతుంది.
ఇదే పెళ్లి చూపులు ముఖ్య కథాశం. దీని చుట్టూ చక్కటి పాత్రలను తయారు చేసి మంచి ఫ్యామిలీ డ్రామా గా రూపొందించారు. రూ.2 కోట్ల లోపే ఈ సినిమా బడ్జెట్ అయింది. ఇంత తక్కువ బడ్జెట్ తో చక్కటి కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అంతర్లీనంగా మనసుకు నచ్చిన పని చేయడమే సక్సెస్‌కు కారణం అవుతుందనే మేసేజ్ కూడా ఇచ్చారు. యువతకు కావాల్సిన అన్నీ అంశాలు ఉన్న పెళ్లి చూపులు చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యూత్ ఆడియన్స్‌తో పాటు అన్నీ ఏజ్ గ్రూపుల ఆడియన్స్‌ను ఇది నచ్చింది.
కేరాఫ్ కంచరపాలెం: 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కథ, కథనాలు అన్నీ వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో రానిస్తారనడానికి అభిరుచి గల నిర్మాత అని పేర్కొనడానికి కేరాఫ్ కంచరపాలెం చిత్ర దర్శక నిర్మాతలే ఉదాహరణ. ఈ సినిమా విడుదలయ్యాక పలువురు సినిమా ప్రముఖులందరూ మేకర్స్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సినిమాలోని పాత్రలన్నీ తెరపై చాలా సాధారణంగా కనిపిస్తాయి. మేకప్, హేయిర్ స్టైల్, అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూంస్ లాంటివేవీ కనిపించవు. హృదయానికి తాకే కథ, కథనాలుండటంతో ఇందులోని పాత్రలకు మంచి పేరొచ్చింది. అమెరికా నుంచి సరదాగా ఇండియాకు వచ్చిన చిత్ర నిర్మాత పరుచూరి ప్రవీణ మురళి కామన్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు వెంకట్ మహాను కలవడం కథ విని నచ్చడం తో కేరాఫ్ కంచరపాలెం చిత్రం తయారైంది. ఈ సినిమా కు అయిన బడ్జెట్ తక్కువే. కానీ, తర్వాత వచ్చిన వసూళ్ళు, దక్కిన ప్రశంసలు ఎంతో గొప్పవని చెప్పాలి.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: ఈ సినిమాను యంగ్ టీమ్ కలిసి చేశారు. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలఓ కనిపించిన నవీన్ పొలిశెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర ను పోషించాడు. థ్రిల్లర్ అండ్ మిస్టరీ కథాంశంతో దర్శకుడు స్వరూప్ ఆరెఎస్‌జే తెరకెక్కించాడు. హీరో పాత్ర డిటెక్టివ్ తరహాలో ఉంటుంది. అత్యంత ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఎక్కడ కూడా కథ పక్కదారికెళ్ళకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎంగేజ్ చేయగలిగాడు దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ మొదటి రోజు పూర్తయ్యేసరి కి పాజిటివ్ టాక్ ఆ తర్వాత హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో లాంగ్ రన్‌లో మంచి వసూళ్ళు రాబట్టింది. అంతేకాదు, హీరో నవీన్ పొలిశెట్టికి ఈ సినిమా మంచి లైఫ్ ఇచ్చింది.
జాతి రత్నాలు: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టికి విపరీతమైన క్రేజ్ వచ్చిన ఈ సినిమాకు కేవలం మూడు కోట్లలోపే బడ్జెట్ అయింది. అనుదీప్ కేవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టితో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. మహానటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ స్వప్న సినిమా పతాకంపై నిర్మించారు. దాదాపు రూ. 70 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమా వచ్చిన సమయంలో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. వాటన్నిటినీ కాదని ప్రేక్షకులు జాతి రత్నాలు చిత్రాన్ని ఆదరించారు.
ఇలా చిన్న సినిమాలే దర్శక, హీరోలకు ఎక్కువగా గుర్తింపు తీసుకువస్తున్నాయ నడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నిర్మాత కూడా పెద్దగా రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే, సినీ పెద్దలు కూడా చిన్న సినిమాలకు ఎక్కువగా థియేటర్స్ కేటాయించాలని కోరుతున్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటి చిన్న సినిమాల వల్లనే ఎక్కువ మంది అన్ని శాఖలకు చెందిన యంగ్ టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయమై గుర్తింపు తెచ్చుకుంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.