Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 60 ఏళ్ల నాటి బనారసీ చీరను కట్టుకుని అదరగొట్టింది. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రీఇమాజిన్ చేసిన చీరలో ఎంతో అందంగా కనిపించింది. ఓ ఈవెంట్ కోసం బ్రొకేడ్ బనారసీ సిల్క్ ప్రీ-డ్రాప్డ్ చీర కట్టుకుని బస్టియర్ బ్లౌజ్‌ని ఎంచుకుని అమ్మడు తన అందాలతో అందరిని ఆకట్టుకుంది. డిజైనర్ పీస్ లో గ్లామరస్ లుక్ లో కనిపించి అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది.
ప్రియాంక తన రీమాజిన్డ్ చీర రూపాన్ని సృష్టించే ప్రక్రియను ప్రదర్శించే చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. వెండి దారాలను ఉపయోగించి తయారు చేసిన అరవై ఏళ్ల పాతకాలపు బనారసీ బ్రోకేడ్ చీర ఇది.
ఖాదీ పట్టుపై బంగారు ఎలక్ట్రోప్లేటింగ్ చేశారు. బ్రోకేడ్‌లో సెట్ చేయబడిన ఇకత్ నేత తొమ్మిది రంగులను ప్రతిబింబించేలా, ఆరు గజాలు వచ్చేలా తీర్చి దిద్దారు. ఈ చీరకు జోడిగా హోలోగ్రాఫిక్ బస్టియర్ ను జత చేశారు.
డిజైనర్ ఈ చీర గురించి మాట్లాడుతూ..” ఇది మా సంతకం. ప్రత్యేకమైన మెటీరియల్‌తో తయారు చేయబడిన ఆభరణాల టోన్డ్, మౌల్డ్ బాడీతో నిర్మించబడింది. బ్రోకేడ్ సెట్ చేయబడిన ఇకత్ నేత యొక్క తొమ్మిది రంగులను ప్రతిబింబించేలా సీక్విన్ షీట్ హోలోగ్రాఫిక్ బస్టియర్‌తో జత చేయబడింది. ఈ చీర వారణాసిలోని క్రాఫ్ట్ క్లస్టర్లలో చేతితో నేసిన పాతకాలపు వస్త్రంతో ఆరు నెలల పాటు రూపొందించబడింది.
ఈ చీరకు తగ్గట్లుగా ప్రియాంక బల్గారీ చోకర్ నెక్లెస్, స్టేట్‌మెంట్ రింగ్‌లు, డైమండ్ ఇయర్ స్టడ్‌లు , హోలోగ్రాఫిక్ హైహీల్స్‌తో సిల్క్ చీరను స్టైల్ చేసింది.
మెరిసేటి సిల్వర్ ఐ షాడో, నిగనిగలాడే మావ్ లిప్ షేడ్, వింగేడ్ ఐలైనర్, కనురెప్పలపై మస్కరా, వింగేడ్ కనుబొమ్మలు, మంచుతో కూడిన మేకప్ బేస్ తో కనిపించి పిచ్చెక్కించింది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.