Pregnant : సాధారణంగా ఒక మహిళ గర్భం దాలిస్తే ఆమె శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి.ఇలా మహిళ గర్భం దాల్చిన సమయంలో హార్మోన్ల అసమర్థ్యత కారణంగా ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కొందరు మధుమేహానికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గర్భం దాల్చిన మహిళలలో కొందరికి మధుమేహం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇలా మధుమేహం రావడం వల్ల కేవలం తల్లికి మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా అది మంచిది కాదని చెప్పాలి.
ఈ విధంగా గర్భిణీ మహిళలలో మధుమేహం రాకుండా ఉండాలి అంటే రాత్రిపూట గర్భిణి స్త్రీలు ఈ పని తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా గర్భిణీ స్త్రీలు రాత్రి పడుకునే సమయంలో తమ గదిలో లైట్ వేసుకొని నిద్రపోతుంటారు అయితే ఇలా చేయడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు నిద్రపోయే ముందు తమ గదిలో గదిలో లైట్లను ఆర్పివేయడమో లేదా.. ఫోకస్ తగ్గించి, డిమ్ లైట్ పెట్టుకోవడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ వర్సిటీ చేసిన సర్వే ప్రకారం గర్భిణీ స్త్రీలు కంప్యూటర్లు సెల్ ఫోన్ లైటింగ్ తమపై పడకుండా ఉండాలని వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం నిద్రపోయే ముందు వరకూ కాంతివంతమైన లైట్ల కింద గడిపితే శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ గాడి తప్పుతుందని ఈ సర్వేలో వెళ్లడైంది.
నిద్రకు ముందుకు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తి కడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుంది. 741 మంది గర్భిణులపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందుకే గర్భం దాల్చిన మహిళలు వీలైనంత వరకు టీవీలు సెల్ ఫోన్లు కంప్యూటర్ల ముందు ఎక్కువగా ఉండకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇలా వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.