Vastu Tips: సాధారణంగా మనం ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మంచి రోజు సరైన ముహూర్తం గడియలు చూసుకుని బయలుదేరుతాము. ఇలా ముఖ్యమైన పనుల నిమిత్తం మనం బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి అవ్వాలని కోరుకుంటాము. అందుకే మనం ఏదైనా శుభకార్యాల నిమిత్తం ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండుసార్లు మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని బయటకు వెళ్తుంటాము అయితే ఇలా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మనం బయటకు వెళ్లేటప్పుడు ఈ విధమైనటువంటి నియమాలను పాటించడం వల్ల మన ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మనం వెళ్లిన పని విజయవంతంగా పూర్తి అవ్వడానికి దోహదం చేస్తుంది. మరి మనం ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే… ముందుగా మనం ఏదైనా పనులను మొత్తం బయటకు వెళ్లేటప్పుడు మనం చేసే ప్రయాణంలో ఈ విధమైనటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండడం కోసం మన ఇంట్లో దేవుడి గదిలో నెయ్యి దీపం వెలిగించి మన ప్రయాణంలో ఆటంకాలు రాకుండా చూడాలని నమస్కరించాలి.
ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మన నోటి నుంచి ఎప్పుడు కూడా ఆ శుభం పలికే మాటలు అలాగే ఇంట్లో వారితో గొడవలు పడకూడదు. పని నిమిత్తం ఒకసారి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి లోపలికి రాకుండా ముందుగానే మనకు కావాల్సిన వస్తువులు అన్నింటిని సిద్ధపరచుకొని బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక బయటకు వెళ్లే ముందు కుడికాలు ముందు బయటకు పెట్టి వెళ్లేలా చూడాలి.ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పక్షులకు లేదా జంతువులకు కాస్త ఆహారం పెట్టి వెళ్లడం మంచిది ఇక రహస్య దానం చేయడం వల్ల మీరు అనుకున్న పని సవ్యంగా జరుగుతుంది. ఇక మీ ఇంటికి సమీపంలో ఏదైనా ఆలయం కనుక ఉంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టి మీ ప్రయాణం చేయడం మంచిది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.