Prashanth Neil : పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న సౌత్ ఇండియన్ సినిమాలు సెన్సేషనల్ హిట్స్ సాధిస్తున్నాయి. బాహుబలి సినిమా మొదలు ఆర్ఆర్ఆర్, సలార్ లేటెస్ట్ గా హనుమాన్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. అయితే మిగతా సినిమాలో ఓ లెక్క హనుమాన్ మూవీ మరో లెక్క. ఎలాంటి అంచనాలు లేకుండా సూపర్ హీరో సినిమాతో యువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యి 17 రోజులు అవుతున్నా వసూళ్ల సునామి కొనసాగుతూనే ఉందీ. ఇప్పటికీ చాలా థియేటర్లలో టికెట్లు దొరకడం లేదు. ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది . సినిమా రిలీజ్ కి ముందుగా చెప్పినట్లుగానే హనుమాన్ టీం ఇప్పటికీ అయోధ్య రామ మందిర ట్రస్ట్ కు ప్రతీ టికెట్ పై 5 రూపాయలను విరాళంగా అందించింది. లేటెస్ట్ గా నిర్మాత నిరంజన్ రెడ్డి మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హనుమాన్ సినిమా నుంచి వచ్చిన ప్రతీ రూపాయని ఆ రెండింటి కోసమే వినియోగించనున్నట్లు తాజాగా ప్రశాంత్ వర్మ నే చెప్పాడు.
తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి అనేక రికార్డులను క్రియేట్ చేసింది. ఆడపడుచుకు కట్నం ఇవ్వలేదట.. అందుకే నిహారిక కోసం ఆ పని చేస్తుందట.. లావణ్య కామెంట్లు వైరల్! చిత్రబృందం ఎప్పటికప్పుడు సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. నెక్స్ట్ వచ్చే సీక్వెల్ చిత్రాల గురించి అప్ డేట్లు ఇస్తున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈక్రమంలోనే దర్శకుడు మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాల గురించి చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చి ప్రతీ రూపాయిని ఓ రెండు పనుల కోసం మాత్రమే ఉపయోగించబోతున్నట్లు వివరించారు.
ఈ మధ్యనే అయోధ్య రామ మందిరానికి ప్రతి టికెట్ నుంచి ఐదు రూపాయల డొనేషన్ ను హనుమాన్ మూవీ టీం అందించింది. కేవలం అయోధ్య రామయ్యకే కాదు భద్రాచలంలో కొలువుదీరిన రామాలయానికి చిన్న ఆలయాలకు ప్రతి టికెట్ నుంచి ఓ రూపాయిని విరాళంగా ఇస్తున్నట్లు టీం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ దేవుడికి విరాళం ఇచ్చినట్లుగా ఫీల్ అవుతారని మేకర్స్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి రూపాయిని సీక్వెల్స్ కి వినియోగించబోట్లు నిర్మాత తనకు చెప్పాడని ప్రశాంత్ వర్మ తెలిపాడు. హనుమాన్ కు సీక్వల్ గా వచ్చే జై హనుమాన్, ఆపై వచ్చే సినిమాలకు ప్రాఫిట్స్ వినిగిస్తామని వివరించారు. ఈ విషయాలు తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.