Pragya Jaiswal: కంచె సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారుతుందని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా ఆమెకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఆ తరువాత నక్షత్రం అనే సినిమాలో ప్రగ్యా జైస్వాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. అదే సమయంలో గ్లామర్ రోల్ లో పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది. ఈ మూవీ హిట్ అయ్యి ఉంటే ప్రగ్యా ఫేట్ మారిపోయేది. కాని నక్షత్రం డిజాస్టర్ కావడంతో ప్రగ్యాని గుర్తించే వారు లేకుండా పోయారు.
తరువాత జయజానకి నాయక అనే సినిమాలో ఈ అమ్మడు సెకండ్ లీడ్ రోల్ లో నటించింది. ఆ పాత్రతో ఆమెకి ఒరిగింది ఏమీ లేదు.కంచె కంటే ముందుగా ఆమె తెలుగులో డేగ అనే సినిమాతో పరిచయం అయ్యింది. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ఎవరికి తెలియదు.
తరువాత లైవ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరో అభిజిత్ తో మిర్చీ లాంటి కుర్రాడు అనే సినిమా కూడా చేసింది. తెలుగులో ఆమె మూడో సినిమాగా కంచె రిలీజ్ అయ్యింది. ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకున్న కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఇదిలా గత ఏడాది అఖండ సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయినా కూడా ఆశించిన స్థాయిలో ప్రగ్యాకి మాత్రం గుర్తింపు రాలేదు.
అలాగే అఖండ మూవీ అవకాశాలు కూడా తెచ్చిపెట్టలేదు. అయితే ఈ అమ్మడు సినిమా ఛాన్స్ లు రాకపోయిన కూడా ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. దీనికి కారణం సోషల్ మీడియా. ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. వీటిని లక్షల్లో చూస్తూ ఉంటారు.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.