Prabhas-Spirit: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించబోతున్న సూపర్ కాప్ స్టోరీ స్పిరిట్ కి క్లాప్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. సందీప్ రెడ్డి వంగ ఆఫీసులో ఈ సినిమా ముహూర్తం జరుపుకుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. అనిమల్ తర్వాత ప్రభాస్ తో చేయనున్న స్పిరిట్ సినిమాకి సంబందించిన పనులను పూర్తి చేస్తూ వచ్చాడు. ఇప్పటికే, దాదాపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి.
దాదాపు స్పిరిట్ సినిమా షూటింగ్ బీజీఎం తోనే జరిగేలా ప్లాన్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా అనిమల్ సినిమాలో ఓ కీ రోల్ చేసిన త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి దీపిక పడుకొణె ని ముందు ప్రకటించిన సందీప్ రెడ్డి వంగ, కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమెని పక్కన పెట్టి తన స్థానంలో త్రిప్తిని తీసుకున్నాడు. ఇక, గత కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్టుగా వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, తాజాగా జరిగిన స్పిరిట్ మూవీ ఓపెనింగ్ కి మాత్రం చిరంజీవి హాజరై క్లాప్ కొట్టడం ఇండస్ట్రీలో.. అలాగే, ప్రభాస్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయింది. బాలీవు స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కూడా చిరుతో కలిసి క్లాప్ కొట్టాడు. మొత్తానికి, ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమా ఓపెనింగ్ మాత్రం జరిగిపోయింది. ఇక, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది సందీప్ రెడ్డి వంగ ఇంకా వెల్లడించలేదు.
కాగా, ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమాతో పాటుగా హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో స్పిరిట్ పట్టలెక్కబోతోంది. ఇక, ఈ సినిమా తర్వాత కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా డార్లింగ్ మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.