Salaar Ott: పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. కే జి ఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఇప్పటికే బెనిఫిట్ షోలో పూర్తిచేసుకుని సినిమాపై మంచి పాజిటివ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు వారి అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
ఇలా థియేటర్లలో ప్రభాస్ సలార్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడంతో బాహుబలి తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ ఈ సినిమా తర్వాతే లభించింది అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీటెయిల్స్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కైవసం చేసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా అన్ని భాషలను కలిపి నెట్ ఫ్లిక్స్ మొత్తంగా రూ. 160 కోట్ల భారీ ధర వెచ్చించి సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్టీమింగ్ ఎప్పుడూ అనే విషయానికి వస్తే ప్రేక్షకుల ఆదరణ ఆ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ సాధించింది అనే దాన్నిబట్టి సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా నెలరోజుల తరువాతనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని విషయాలను నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తెలియజేయనున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.