Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్జరీ తర్వాత నేడు ఇండియాకి చేరుకున్నారు. ఏయిర్‌పోర్ట్‌లో దిగిన ప్రభాస్ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం సలార్. ఈ సినిమా కోసం ప్రపచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియ రేంజ్‌లో హోంబలే సంస్థపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వర్క్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సలార్ డిసెంబర్ 22 కి పోస్ట్ పోన్ అయింది. ప్రభాస్ మోకాలి నొప్పి సమస్య కారణంగా సర్జరీ కోసం ఇటలీ వెళ్ళారు. సర్జరీ పూర్తై అక్కడే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని ఇండియాలో ల్యాండ్ అయ్యాడు.
దాంతో అందరూ సలార్ ప్రమోషన్స్ మొదలు పెడతారని ఎంతో ఆరాటంగా మాట్లాడుకుంటున్నారు. రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల సమయంలోనే మోకాలు నిప్పితో తీవ్రంగా బాధపడ్దారు. మొత్తానికి సర్జరీ తర్వాత ఫుల్ యాక్టివ్‌గా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక సలార్ సినిమా ప్రమోషన్స్ ని నాన్ స్టాప్‌గా నిర్వహించాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ప్రభాస్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో సందడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబైలో కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి సలార్ ప్రమోషన్స్ కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయో.
ఈ సినిమా కాకుండా కల్కి పూర్తి చేయాల్సి ఉంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని చేయాలి. అలాగే మధ్యలో మారుతి సినిమా ఒకటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.