Post Office: జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో గ్యారెంటీ లేదు. ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి రేపుంటుందన్న భరోసా లేదు. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక ఈ రోజు వరకు బ్రతుకుతే చాలు అనుకునే మనుషులు ఈ లోకంలో చాలా మందే ఉన్నారు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము ఆనందంగా, ఆర్ధికంగా బలంగా లేకపోయినా తమ తరువాత వారి భవిష్యత్తు బాగుండాలనే కోరికతో చాలా మంది సేవింగ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద మొత్తంలోనో చిన్న మొత్తంలోనో తాము సంపాదిస్తున్న దానిలో కొంత మొత్తాన్ని దాచేందుకు ముందుకు వస్తున్నారు.
అయితే ఒకప్పుడు మన పెద్దవారు కూడా అప్పట్లో అందుబాటులో ఉన్న పోస్టాఫీసు ల్లో డబ్బులను ప్రతి నెల పొదుపు చేసేవారు. మెచ్యూరిటీ వచ్చిన మొత్తాన్ని తీసుకుని పిల్లలకు పంచేవారు. అయితే ఇప్పుడు అనేక బ్యాంకులు, ప్రైవేటు కంపెనీల్లో పొదుపు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ ఆనాటి పోస్టాఫీసుల్లోనే డబ్బును భద్రంగా పొదుపు చేసుకునేందుకు ఇప్పటికీ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కారణం ఇక్కడ ప్రజలు అందరూ ఇష్టపడే విధంగా చిన్న చిన్న పథకాలు కూడా అందుబాటులో ఉండటం. చిన్న మొత్తంలో కూడా ప్రజలు పోస్టాఫీసుల్లో చేసుకునే వెసులుబాటు ఉండటం. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పోస్టాఫీసులు నడవడం వల్ల కూడా సురక్షితంగా పెట్టుబడి పెట్టవచ్చన్న నమ్మకం ఏర్పడుతుండటం.
భారతీయ పోస్టాఫీసుల్లో ఎన్నో పథకాలు అందబాటులో ఉన్నాయి. డెయిలీ లేబరు నుంచి బిజినెస్ మెన్ వరకు వారి స్థాయిని బట్టి డబ్బును జమ చేసుకునే వెసులుబాటు ఈ తపాలా కార్యాలయాల్లో ఉంటుంది. ఈ పథకాలు కూడా పెట్టుబడి పెట్టిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు వడ్డీ కూడా అధిక శాతం లభిస్తుంటుంది. ప్రస్తుతం ఖాతాపైన 4.0 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. బ్యాంకులో డబ్బులు జమ చేయాలంటే ముందుగా అకౌంట్‌ను తెరవాలి. ఈ అకౌంట్ తెరవడం కోసం 500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మైనర్లకు అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది . ఒకవేళ మైనర్ తరఫున సేవింగ్స్ చేయాలనుకునే వారు వారి బదులు సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు. మరీ ముఖ్యంగా ఒక వ్యక్తికి ఒక ఖాతా మాత్రమే ఇస్తారు.
జాయింట్‌గాను ఇద్దరు కలిసి జాయింట్ ఖాతాను తెరవవచ్చు. ఖాతను తెరిచే సమయంలో తప్పనిసరిగా నామినీని చేర్చవలసి ఉంటుంది. తమ తరువాత ఎవరికి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో వారి పేరును సదరు దరఖాస్తులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అని, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా అని పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం అని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని, 15 సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అని, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన పథకం అని ఇలా చాలా రకాల పథకాలు భారతీయ పోస్టాఫీసుల్లో లభిస్తాయి.
పోస్టాఫీసుల్లో 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధుల కోసం ప్రత్యేక పథకాలు పోస్టాఫీసులులో ఉన్నాయి. పోస్టాఫీసులో ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వారి కోసమే ప్రత్యేకంగా చేయబడిన పథకం. 60 ఏళ్లు దాటిని వారు ఎవరైనా ఈ పథకంలో భాగస్వామ్యులు కావచ్చు. పోస్టాఫీసులులో ఖాతాను తెరవవచ్చు. ముఖ్యంగా ఈ పథకంలో లభించే వడ్డీ రేటు అందరినీ ఆకర్షిస్తుంది. ఈ పథకంలో 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. 15 లక్షల రూపాయలు మించకుండా పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ పొదుపును జమచేసేందుకు వీరికి 5 సంవత్సరాల వరకు వ్యవధిని ఇస్తారు.
పెద్దలకే కాదు ఆడపిల్లలకు చక్కటి పథకాలు పోస్టాఫీసుల్లో ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఆడపిల్లలకు ప్రత్యేక పథకాన్ని అందిస్తోంది పోస్టాఫీస్. ఈ పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుర్లకు బంగారు భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో పోస్టాఫీసుల్లో పొదుపు మొదలుపెట్టారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమె పెరిగి 10 ఏళ్లు నిండే వరకు ఆమె పేరు మీద పోస్టాఫీసుల్లో ఓ ఖాతాను తెరిచే వెసులుబాటు కల్పించింది తపాలాశాఖ. ఇందులో వడ్డీ రేటు కూడా అధికంగానే ఉంది. 7.6 శాతాన్ని వడ్డీ కింద చెల్లిస్తోంది. ఈ పథకం ద్వారా ఆడపిల్ల పేరు మీద సంవత్సరానికి కనిష్టంగా వెయ్యి రూపాయల నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.