Poonam Pandey : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పూనమ్ పాండే పేరు ట్రెండింగ్ లో ఉంది. ఏ న్యూస్ ఛానల్ చూసినా, నెట్టింట్లో ఏ అకౌంట్ స్క్రోల్ చేసినా పూనమ్ పాండే కు సంబంధించిన వార్తలే దర్శనమిస్తున్నాయి. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ నటి పూనమ్ పాండే చనిపోయిందని, ఆమె మృతి కారణం సర్వైకల్ క్యాన్సర్ అని నిన్నంతా వార్తలు హల్ చల్ చేశాయి. పూనమ్ చనిపోయిందన్న వార్త ఆమె ఇన్ స్టాగ్రామ్ నుంచే రావడం ఆమె మేనేజరే స్వయంగా పోస్ట్ షేర్ చేయడంతో అందరూ ఆమె చనిపోయిందని నమ్మారు. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమె ఫ్యాన్స్ శోకంలో శోకంలో మునిగిపోయారు. పూనమ్ మృతి న్యూస్ తో పాటు సర్వైకల్ క్యాన్సర్ గురించి పెద్ద ఎత్తున నెట్టింట్లో చర్చ జరిగింది. ఇక పూనమ్ లేదు అని అందరూ ఫిక్స్ అయిన తరుణంలో చావు కబురు చల్లగా చెప్పింది ఈ బ్యూటీ ‘నేను బతికే ఉన్నాను’ అంటూ తన ట్విటర్ అకౌంట్లో ఓ వీడియోను ఇవాళ పూనమ్ పాండే షేర్ చేసింది. ఏ అకౌంట్ నుంచి అయితే తాను చనిపోయినట్లు న్యూస్ స్ప్రెడ్ చేసిందో అదే అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. కొంత మంది ఆమె చేసిన పనికి మండిపడుతుంటే మరికొంత మంది పూనమ్ వల్లే సర్వైకల్ క్యాన్సర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి గర్భాశయ క్యాన్సర్ పై చాలామంది మహిళలకు సరైన అవగాహన లేదు. ఈ క్యాన్సర్ పై అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను మరణించినట్లు ప్రచారం చేపించినట్లు పూనమ్ ఈ వీడియోలో తెలిపింది. ఈ వీడియోలో పూనమ్ మాట్లాడుతూ “నేను చనిపోలేదు . బతికే ఉన్నాను. దేశంలో సర్వైకల్ క్యాన్సర్ వల్ల చాలామంది మహిళలు చనిపోతున్నారు. ఇది మిగతా క్యాన్సర్లలా కాదు. ఈ క్యాన్సర్ ను కంట్రల్ చేయడం సాధ్యమే. హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం లేదా ఈ క్యాన్సర్ ను ఫస్ట్ స్టేజ్ లోనే గుర్తించడం అవసరం. ఈ క్యాన్సర్ తో చనిపోకుండా ఉండేందుకు చాలా అవకాశాలు, మార్గాలు, పద్ధతులు ఉన్నాయి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి “అని పూనమ్ తెలిపింది. ఎప్పుడూ నెట్టింట్లో కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచే పూనమ్ ఈసారి తన చావుపై ప్రాంక్ చేయడంతో అంతా మండిపడుతున్నారు. ఇలా ఫేక్ న్యూస్ తో ప్రజలను ఫూల్ చేసినందుకు తనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. చట్టం-2000లోని సెక్షన్ 67 ప్రకారం పూనమ్ పాండేపై కేసు వేసి , జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నిజానికి సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అది నిజమని రుజువైతే.. అతనికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. అంతే కాదు రూ.5లక్షల వరకు ఫైన్ విధిస్తారు. అదే నేరాన్ని మళ్లీ చేస్తే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు ఫైన్ ను దోషి చెల్లించాల్సి వస్తుంది. ఈ కేసులను దృష్టిలో పెట్టుకుని పలువురు పూనమ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది క్యాన్సర్ పై ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా ఎవరూ పట్టించుకోవట్లేదని, పూనమ్ చావు పుకారు కారణంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో పూనమ్ ను తప్పుబట్టొద్దని ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. మరి పోలీసులు ఈ ఫేక్ న్యూస్ పై ఎలా రెస్పాండ్ అవుతారు. ఆమెపై కేసు నమోదు చేస్తారా?. లేదా అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.