Poonam Kaur : కోలివుడ్ యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం మన్సూర్ కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మన్సూర్ తీరును తప్పుపడుతూ ఇప్పటివరకు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు త్రిషకు సపోర్టుగా నిలుస్తున్నారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని త్రిషకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి కుష్బూ, హీరో నితిన్ ఈ వివాదం పై స్పందించారు.అయితే మెగాస్టార్ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ నెట్ లో వైరల్ అవుతుంది.
‘లియో’లో మూవీ లో తనకు , త్రిషకు మధ్య రేప్ సీన్ ఉంటుందని ఆశిస్తే… అలాంటి సీన్ లెకపివాడంతో అప్ సెట్ అయినట్లు నటుడు మన్సూన్ అలీ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తెలుగు, తమిళం అని వ్యత్యాసాలు లేకుండా అందరు త్రిషకు సపోర్టుగా నిలిచారు. మెగాస్టార్ కూడా త్రిషకు అండగా ఉంటానని చెప్పారు. ఇండస్ట్రీలోని ఏ మహిళపై అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తాను ఖండిస్తానని చెప్పారు. అయితే ఆయన కామెంట్ చేసిన కొన్ని నిమిషాలకే పూనమ్ కౌర్ కామెంట్ చేసింది. అయితే ఈ కామెంట్స్ అన్నీ కూడా మెగాస్టార్ ని టార్గెట్ చేసే చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.
“సడన్‌గా మానవత్వం గుర్తుకు వచ్చిందా?. చాలా ఇంపార్టెంట్ విషయాల్లో తమ గొంతు వినిపించని చాలా మందికి ఇవాళ ఉన్నట్లుండి మానవత్వం గుర్తుకు వచ్చింది . తమ ప్రెస్టీజ్ ను పెంచుకోవడానికో లేదా స్టేటస్ కోసం ఇలా స్త్రీలకు సపోర్ట్ గా ఉండకూడదు “అని పూనమ్ తెలిపింది. పూనమ్ కౌర్ ఈ ట్వీట్ కింద చిరును ట్యాగ్ చేసి ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. పూనమ్ ట్వీట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తోటి హీరోయిన్ గా , మరో మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఆమెకు అనుకూలంగా స్పందిస్తే అభినందించడం పోయి… ఇలా పరోక్షంగా విమర్శలు చేయడం మంచిది కాదని అంటున్నారు. ఇలా ఓ ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేసి ప్రతిసారీ వ్యతిరేకత వ్యక్తం చేయడం ఆమె అలవాటుగా మారిందని చర్చించుకుంటున్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.