Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం ‘సేమ్ టు సేమ్’ అనిపిస్తోంది. ఒకప్పుడు అధికార పీఠంపై కూర్చుని రెండు తెలుగు రాష్ట్రాలను శాసించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు విపక్ష స్థానానికే పరిమితమయ్యారు. అయితే, ఓటమి తర్వాత ఈ ఇద్దరు ప్రాంతీయ పార్టీల అధినేతలు తీసుకుంటున్న నిర్ణయాలు, వారి బాడీ లాంగ్వేజ్, భవిష్యత్తు కార్యాచరణను గమనిస్తే.. ఇద్దరూ ఒకే స్క్రిప్ట్‌ను ఫాలో అవుతున్నారా అనే అనుమానం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

సాధారణంగా ఓడిపోయిన పార్టీలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడం ఆనవాయితీ. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీ మొహం చూసింది లేదు. అటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్ కూడా అదే బాట పట్టారు. మైకులు ఇవ్వడం లేదనో, ప్రతిపక్ష హోదా దక్కలేదనో కారణాలు ఏవైనా.. ఇద్దరు టాప్ లీడర్లు చట్టసభలకు దూరంగా ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్. మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతామనే బలమైన సంకేతాన్ని ఇద్దరూ తమ క్యాడర్‌కు పంపుతున్నట్లు కనిపిస్తోంది.

politics-target-2029-jagan-and-kcr-on-the-same-path

Politics: ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అసెంబ్లీకి నో చెప్పిన ఈ నేతలు.. జనం మధ్యకు వెళ్లేందుకు మాత్రం ఒకే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఇరు రాష్ట్రాల్లో పాదయాత్రలే శరణ్యమని నమ్ముతున్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపు ఒకే సమయంలో జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండటం విశేషం. సభల్లో మాట్లాడేదానికంటే, నేరుగా జనం గుండెల్లోకి దూసుకుపోవడమే 2029 టార్గెట్‌కు సరైన రూట్ అని ఇరు పార్టీల అధిష్టానాలు భావిస్తున్నాయి.

అయితే, ఈ ఇద్దరు నేతల సరికొత్త పొలిటికల్ ఫిలాసఫీ ఇప్పుడు ప్రజల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. సమస్యల మీద తక్షణ పోరాటాలు చేసి, ప్రభుత్వం మెడలు వంచి పరిష్కారాలు సాధించడం పాత పద్ధతి అన్నట్లుగా వీరి వైఖరి ఉంది. బాధితులు ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే.. “మరో రెండేళ్లు/మూడేళ్లు ఓపిక పట్టండి, మా ప్రభుత్వం రాగానే మీ సమస్యలు తీరుస్తాం” అంటూ భరోసా ఇస్తున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో జగన్ ఇస్తున్న స్టేట్‌మెంట్లు దీనికి అద్దం పడుతున్నాయి. మరి, “అధికారంలోకి వస్తేనే న్యాయం” అనే ఈ సరికొత్త విపక్ష ఫార్ములా 2029లో వీరికి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.