Political: తెలంగాణలో ఏపీ కూటమి స్కెచ్.. కేసీఆర్, రేవంత్ కు షాక్ త‌ప్ప‌దా?

Political: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇప్పుడు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాలు. ఏపీలో సంచలన విజయం సాధించిన ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ అప్లై చేస్తే ఎలా ఉంటుందనే దిశగా తెరవెనుక శరవేగంగా పావులు కదులుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే గనుక నిజమైతే, తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలుకావడం ఖాయం.

ఇటీవల జరిగిన మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. తెలంగాణలో పార్టీ క్యాడర్‌ను మళ్లీ యాక్టివ్ చేస్తామని, త్వరలోనే ఇక్కడి నాయకులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించడం గులాబీ, కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి తెలంగాణలో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంక్, క్యాడర్ ఉండటంతో లోకేశ్ రీ-ఎంట్రీ ప్లాన్ ఆసక్తికరంగా మారింది.

political-ap-alliance-sketch-in-telangana-isnt-it-a-shock-for-kcr-and-revanth

Political: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు.

మరోవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బరిలో నిలుస్తామని ఆయన స్వయంగా ప్రకటించడం విశేషం. అయితే, ఎక్కడా కూడా పొత్తులు ఉండవు అని ఆయన ఖచ్చితంగా చెప్పకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. దీనికి తోడు, పవన్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు సమర్థిస్తూ సానుకూల సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే.. ఏపీ కూటమి ఇక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏపీలో సూపర్ హిట్ అయిన కూటమి మ్యాజిక్, తెలంగాణలోనూ వర్కవుట్ అయితే ఓట్ల చీలికను నిరోధించి అధికార పీఠాన్ని కదిలించే అవకాశం ఉందనేది పొలిటికల్ ఎనలిస్టుల అంచనా. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్షంగా నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పట్టు బిగిస్తుంటే, కేసీఆర్ సైతం మళ్లీ పుంజుకునే వ్యూహాల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా బరిలోకి దిగితే.. అది రెండు పార్టీలకూ పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు, యూత్ సపోర్ట్ కూటమి వైపు మళ్ళితే.. అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఇటు కేసీఆర్ మైండ్ గేమ్‌కు గట్టి బ్రేకులు పడటం ఖాయం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.