Spiritual: శ్రావణమాసం హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం అని చెబుతారు ఈ శ్రావణమాసంలో మహిళలందరూ పెద్ద ఎత్తున వ్రతాలు నోములు పూజలు చేస్తూ ఉంటారు ఇక ఈ నెలలో చాలామంది మాంసం కూడా ముట్టుకోరు ఇలా ఎంతో పవిత్రంగా శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. ఇక శ్రావణ మాసం అంటే ఆ పరమ శివుడికి ఎంతో ప్రీతికరమైనది కనుక శ్రావణమాసంలో శివుడికి కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వ వృక్షం నాటవచ్చా లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది.
బిల్వ మొక్క పార్వతి దేవి చెమట నుంచి ఉద్భవించినదని అందుకే ఈ మొక్క అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమని చెబుతుంటారు ప్రతి రోజు బిల్వ దళాలతో పరమశివుడిని పూజించడం వల్ల ఆయన కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని మన ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారని భావిస్తారు. అంతేకాకుండా ఏ ఇంటి ఆవరణంలో అయితే బిల్వ వృక్షం ఉంటుందో ఆ ఇంటి పట్ల శివుడి అనుగ్రహం ఉన్నట్లేనని పండితులు చెబుతున్నారు.
ఇలా శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ బిల్వ మొక్కను శ్రావణమాసంలో నాటడం శుభప్రదం అని, ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇక ఈ మొక్కను నాటాలి అనుకునేవారు వాస్తు అనుగుణంగా నాటడం ఎంతో మంచిది. వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా పడమర దిశలో బిల్వ పత్ర మొక్కను నాటడం ప్రయోజనకరంగా భావిస్తారు. ప్రతికూలతను తొలగించడానికి, మీరు మీ ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కను కూడా నాటవచ్చు. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.