Periods: సాధారణంగా మహిళలు నెలలకు ఒకసారి నెలసరి సమస్యతో బాధపడుతూ ఉంటారు అయితే చాలామందిలో నెలసరి అనేది సక్రమంగా రాకపోవడం వల్ల ఎన్నో రకాల ఇతర సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలా అమ్మాయిలలో నెలసరి సక్రమంగా రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఇలా పెళ్లయిన అమ్మాయిలలో నెలసరి సక్రమంగా రాకపోవడం వల్ల ఆ ప్రభావం గర్భధారణ పై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే పీరియడ్స్ విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది.
ఇక పీరియడ్స్ నెల నెల సక్రమంగా రాలేదు అంటే అందుకు కొన్ని కారణాలు కూడా కావచ్చు ఒకటి మనం తీసుకునే ఆహారం కాగా రెండవది మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి కూడా కారణం కావచ్చు.మరి నెలసరి సక్రమంగా రాకపోవడానికి గల కారణాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం..ప్రస్తుత కాలంలో మహిళలు ఇంటి పనితో పాటు వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా అన్ని పనులు చూసుకోవడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడికి గురవడం వల్ల వారి శరీరం కార్టిసాల్‌ను అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది, ఇది మీ పునరుత్పత్తి వ్యవస్థ పై ప్రభావం చూపి పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి కారణం అవుతుంది.
ఇక శరీర బరువు వేగంగా పెరగడం లేదా తగ్గిపోవడం వంటివి చేయడం వల్ల మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ రావడానికి ఆలస్యం కావచ్చు. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి థైరాయిడ్ రుగ్మతలు మీ రుతు చక్రంపై ప్రభావం చూపుతాయి. పీసీఓఎస్ అనేది హార్మోన్ల రుగ్మత. ఇది క్రమరహిత పీరియడ్స్‌తో ఆలస్యమైన అండోత్సర్గానికి దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.